Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu : చంద్రబాబు గురించి మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్

Chandrababu : చంద్రబాబు గురించి మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్

Chandrababu : చంద్రబాబు గురించి మాట్లాడుతూ లోకేశ్ ఎమోషనల్
X

చంద్రబాబు అరెస్టుపై నారా లోకేశ్ కంటతడి పెట్టుకున్నారు. మంగళగిరిలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న లోకేశ్ ఎమోషనల్ అయ్యారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజల కోసమే నిస్వార్థంగా పనిచేసిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో నిందితులు అందరూ బయటికొచ్చినా.. చంద్రబాబును కావాలనే జైల్లో ఉంచారని అన్నారు. జగన్ ప్రభుత్వం వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ 43 రోజులుగా చంద్రబాబును రాజమండ్రి జైలులో నిర్బంధించారని చెప్పారు. చంద్రబాబు విషయాన్ని తలచుకుంటేనే దుఃఖం తన్నుకొస్తోందని, చివరకు తన తల్లి భువనేశ్వరిపైనా కూడా కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఎంతోమందికి ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించిన చంద్రబాబుపై దొంగ కేసులు పెట్టారని లోకేశ్ భావోద్వేగానికి లోనయ్యారు. రేపటి రోజుల్లో సైకిల్ తొక్కుకుంటూ వెళ్లినా సైకో జగన్ అక్రమ కేసుల్లో బుక్ చేస్తారని మండిపడ్డారు.

Updated : 21 Oct 2023 2:31 PM IST
Tags:    
Next Story
Share it
Top