Home > ఆంధ్రప్రదేశ్ > హైదరాబాద్ టు రాజమండ్రి.. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ.. ఎందుకంటే..?

హైదరాబాద్ టు రాజమండ్రి.. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ.. ఎందుకంటే..?

హైదరాబాద్ టు రాజమండ్రి.. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ.. ఎందుకంటే..?
X

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ ఏపీలో పెద్ద దుమారాన్ని రేపుతోంది. టీడీపీ శ్రేణులు సహా పలు వర్గాల ప్రజలు బాబుకు మద్ధతుగా ర్యాలీలు, ధర్నాలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఐటీ ఉద్యోగులు బాబుకు సపోర్ట్గా కార్ల ర్యాలీ చేపట్టారు. కారులో సంఘీభావ యాత్ర పేరుతో హైదరాబాద్ టు రాజమండ్రి వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. రాజమండ్రికి చేరుకున్న తర్వాత నారా భువనేశ్వరిని కలిసి సంఘీభావం తెలుపుతారు.

ఐటీ ఉద్యోగుల ర్యాలీకి ఏపీలో అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఏపీలో 144 సెక్షన్ అమల్లో ఉందని.. రూల్స్ బ్రేక్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో విజయవాడ వైపు వెళ్లే కార్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు ఇవాళ్టితో చంద్రబాబు సీఐడీ కస్టడీ ముగియనుంది. ఇవాళ బాబును అధికారులు రెండో రోజు విచారించనున్నారు. నిన్న ఉదయం 9.30 నుంచి 5గంటల వరకు బాబును అధికారులు విచారించారు. ఈ కేసుకు సంబంధించి పలు ప్రశ్నలను ఆరా తీశారు. ఇవాళ కస్టడీ ముగిశాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు ప్రవేశపెడతారు.


Updated : 24 Sep 2023 3:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top