ఏపీలో తప్పిన పెను రైలు ప్రమాదం...
X
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాద సమయంలోనే ఏపీలో మరో రైలు ప్రమాదం తప్పింది. శ్రీసత్యసాయి జిల్లాలోని కదిరి రైల్వే స్టేషన్ సమీపంలోని కూటాగుళ్ల వద్ద రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం అందరినీ కాసేపు కలవరానికి గురిచేసింది. నాగర్ కోయిల్ జంక్షన్ -ముంబయి సీఎస్‌ఎంటీ రైలు వచ్చే సమయంలో గేట్‍మెన్ గేటు వేయలేదు. దీంతో రాకపోకలు సాగాయి. ఇంతలో కొంత మంది రైలు రావాడాన్ని గమనించి ఇతరులను అప్రమత్తం చేశారు. లోకో పైలట్ కూడా పరిస్థితిని గమనించి రైల్వే గేటుకు కొద్ది దూరంలో ట్రైన్ ఆపివేయడంతో అంతా ఊపిరీ పీల్చుకున్నారు.
అనంతరం ట్రైన్ దిగి లోకో పైలట్ గేట్ మ్యాన్ గదికి వెళ్లగా...అక్కడ సిబ్బంది ఎవరూ కనిపించలేదు. దీంతో అధికారులకు సమాచారం అందించారు. రైల్వే సిబ్బంది తీరుపై ప్రజలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకో పైలట్ సకాలంలో స్పందించి రైలు ఆపకుంటే పరిస్థితి ఏంటనీ ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సిబ్బంది తీరుతో ఘోర ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని మండిపడుతున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై రైల్వే అధికారులు విచారణ జరుపుతున్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.