Home > ఆంధ్రప్రదేశ్ > ఒడిశా రైలు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి.. హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే

ఒడిశా రైలు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి.. హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే

ఒడిశా రైలు ప్రమాదంలో తెలుగు వ్యక్తి మృతి.. హెల్ప్ లైన్ నంబర్స్ ఇవే
X





దేశ వ్యాప్తంగా దిగ్భ్రాంతికి గురి చేసిన ఒడిశా రైలు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలానికి చెందిన జగన్నాధపురానికి చెందిన గురుమూర్తి (60) మృత్యువాత పడ్డారు. నిన్న(శనివారం) జరిగిన రైలు దుర్ఘటనలో గురుమూర్తి యశ్వంత్‌పూర్‌ రైలులో ప్రయాణిస్తూ మృతి చెందినట్లు గుర్తించారు. ప్రమాద వార్త తెలుసుకున్న గురుమూర్తి కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకోగా అక్కడే అతని మృతదేహాన్ని అప్పగించారు. మృతుడి కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఇక ఇప్పటికే మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ రూ.10 లక్షలు, ప్రధాని మోదీ మరో రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఏపీకి చెందిన మరో 11 మంది క్షతగాత్రులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. వీరిలో 9 మందిని మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలించారు. మరో ఇద్దరిని భువనేశ్వర్‌లోని అపోలోకు తరలించారు. గుర్తు తెలియని మరో 30 మంది ఫొటోలు అధికారులకు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. కాగా ప్రమాదానికి గురైన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంతపూర్ ఎక్స్‌ప్రెస్ రెండింటిలోనూ ఏపీకి చెందిన 571 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వీరిలో 141 మంది ప్రయాణికుల వివరాలు ఇప్పటి వరకూ తెలియరాలేదు. గల్లంతైన ప్రయాణికుల జాడ కోసం విశాఖపట్నం కలెక్టరేట్‌లో 9154405292 వాట్సాప్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.

ఈ ప్రమాదంలో ఏపీవాసుల వివరాలు, భద్రత కోసం ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో క్షత్రగాత్రుల సమాచారం కోసం విపత్తుల సంస్థ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ 24/7 కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఇచ్చింది. మిస్సయిన వారి సమాచారం కోసం ఈ 1070, 112, 18004250101 ఫోన్‌ చేయాలని సూచించింది. అలాగే, 8333905022 నెంబర్‌కు ప్రయాణికుడి ఫొటో, ఇతర వివరాలను వాట్సాప్‌లో పంపించాలని తెలిపింది. అనంతరం, వివరాల ఆధారంగా పోలీసు శాఖతో సమన్వం చేసుకుని బాధితులకు వివరాలు తెలియజేయనున్నట్టు అధికారులు తెలిపారు.




Updated : 4 Jun 2023 12:36 PM IST
Tags:    
Next Story
Share it
Top