Home > ఆంధ్రప్రదేశ్ > Manappuram Lady Thief Arrested: పోలీసులకు చిక్కిన ‘మణప్పురం’ మాయలేడీ.. ప్రియుడితో కలసి పక్కా ప్లాన్!!

Manappuram Lady Thief Arrested: పోలీసులకు చిక్కిన ‘మణప్పురం’ మాయలేడీ.. ప్రియుడితో కలసి పక్కా ప్లాన్!!

Manappuram Lady Thief Arrested: పోలీసులకు చిక్కిన ‘మణప్పురం’ మాయలేడీ.. ప్రియుడితో కలసి పక్కా ప్లాన్!!
X

ఏపీలోని కృష్ణా జిల్లా కంకిపాడు మణప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో జరిగిన చోరీని పోలీసులు చేధించినట్లు సమాచారం. గత సోమవారం రాత్రి కంపెనీ బ్రాంచ్‌ హెడ్‌.. తన ప్రియుడితో కలసి రూ.6 కోట్లకు పైగా విలువైన 10.660 కిలోల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బ్రాంచి మేనేజర్‌ రెడ్డి వెంకటపావని(30)ని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెచోరీ చేసిన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని లింగవరం గ్రామానికి చెందిన రెడ్డి వెంకటపావని(30) ఏడాది నుంచి కంకిపాడులోని మణప్పురం ఫైనాన్స్‌ సంస్థ బ్రాంచి హెడ్‌గా పనిచేస్తోంది. ఆమె భర్తతో మనస్పర్థల కారణంగా కంకిపాడులో వేరుగా ఉంటోంది. కృత్తివెన్నుకు చెందిన ఓ వ్యక్తితో సన్నిహితంగా మెలుగుతోంది. అతడు ఓ ప్రైవేటు పాఠశాలను నడుపుతున్నాడు. అతడికి అప్పులు ఉండటం, ఇద్దరూ విలాసవంతమైన జీవితం గడపాలన్న ఉద్దేశంతో బ్యాంకులో చోరీకి పక్కా ప్లాన్ వేశారు.

ఈ క్రమంలోనే గత సోమవారం 16వ తేదీన ఆమె ఈ చోరీకి పాల్పడింది. అదేరోజు రాత్రి ఇంటికి వెళ్లి ఇంట్లో తన బ్యాగు, సెల్‌ఫోను ఉంచి బంగారంతో పాటు తన సన్నిహితుడి కారులో వెళ్లింది. బంగారం అతడికి ఇచ్చి కొంత బంగారం తీసుకుని తన బంధువులు షిర్డి వెళుతుంటే వారితోపాటు అక్కడికి వెళ్లిపోయింది. బంధువుల ఫోన్‌ నుంచి తన కుటుంబ సభ్యులతో పావని మాట్లాడటంతో పోలీసులు అప్పటికే వారిపై నిఘా పెట్టడటం.. ఆమె ఎక్కడుందనే విషయాన్ని తెలుసుకుని వెంటనే బృందాలుగా ఏర్పడి షిర్డి బయలుదేరి వెళ్లారు. షిర్డిలో ఆమెను గుర్తించి పట్టుకుని శుక్రవారం రాత్రి కంకిపాడుకు తీసుకు వచ్చారు. ఈ విషయాలను పోలీసులు నిర్ధారించలేదు.

Updated : 22 Oct 2023 8:31 AM IST
Tags:    
Next Story
Share it
Top