Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబుతో మంచు మనోజ్‌ భేటీ..

చంద్రబాబుతో మంచు మనోజ్‌ భేటీ..

చంద్రబాబుతో మంచు మనోజ్‌ భేటీ..
X

మంచు మనోజ్ పేరు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‎గా మారింది. మనోజ్ పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చ నడుస్తోంది. ఈ మధ్యనే మనోజ్ భూమా నాగిరెడ్డి- భూమా శోభా దంపతుల రెండవ కూతురు భూమా మౌనికను రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి సమయంలోనే మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమైనా ఉందేమో అనే వార్తలు తెరమీదకు వచ్చాయి. అయితే తనకు రాజకీయాలపైన ఆసక్తి లేదని మౌనికను ప్రోత్సహిస్తానని అప్పట్లోనే చెప్పారు మనోజ్. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో మనోజ్ రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో మంచు మనోజ్‌ దంపతులు భేటీ కావడంతో సర్వత్ర ఆసక్తి నెలకొంది.త్వరలో ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. దాదాపు 45 నిమిషాల పాటు బాబుతో మంచు కపుల్స్ సమావేశమయ్యారు. భేటీలో ఫ్యామిలీ విషయాలతో పాటు పొలిటికల్ అంశాల గురించి చర్చ జరిగినట్లు సమాచారం. మనోజ్, మౌనికల పొలిటికల్ ఎంట్రీ కన్ఫార్మ్ అని మీడియాలో ఉదయం నుంచి వార్తలు వస్తున్న నేపథ్యంలో మనోజ్ వీటన్నింటికీ క్లారిటీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మనోజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు మా ఫ్యామిలీకి చాలా దగ్గరి వ్యక్తి. మేమంటే ఆయనకు ఎంతో అభిమానం. మౌనికతో పెళ్లి తర్వాత ఆయన్ను కలవాలనుకున్నాం. కానీ చాలా రోజులుగా కుదరలేదు. చంద్రబాబు గారు కూడా చాలా బిజీగా ఉన్నారు. దీంతో హైదరాబాద్ వచ్చినప్పుడు కలుద్దామన్నారు. ఇవాళ ఉదయం ఫోన్‌ చేసి రమ్మంటే, ఇలా వచ్చాం. పెళ్లి తరువాత మొదటిసారి ఇవాళే బాబుగారిని కలిశాము. మంగళవారం మా బాబు బర్త్ డే ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. త్వరలో పొలిటికల్ ఎంట్రీపై నిర్ణయం ఉంటుంది. సందర్భం వచ్చినప్పుడు నేనే చెబుతాను" అని మనోజ్ తెలిపారు. సో దీనిని బట్టి చూస్తే మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఖాయమని, ఆ మాటను తానే చెప్పకనే చెప్పేశారని ఏపీలో టాక్ వినిపిస్తోంది.


Updated : 31 July 2023 3:30 PM GMT
Tags:    
Next Story
Share it
Top