Home > ఆంధ్రప్రదేశ్ > విశాఖ దిశగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దు..

విశాఖ దిశగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దు..

విశాఖ  దిశగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దు..
X

విశాఖ దిశగా రాకపోకలు సాగించే పలు రైళ్లు రద్దయ్యాయి. తాడి-అనకాపల్లి మధ్య రాజుపాలెం గేటు వద్ద బొగ్గుతో వెళ్తున్న గూడ్సు రైలు బుధవారం పట్టాలు తప్పడంతో రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మద్య రైల్వే ప్రకటించింది. మొత్తం 14 రైళ్లు రద్దయ్యాయి. వాటిలో సికింద్రాబాద్ నుంచి విశాఖకు నడిచే గోదావరి ట్రైన్ కూడా ఉంది. హైదరాబాద్‌-విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12728) రైలును 15, 16 తేదీల్లో రద్దు చేసిన అధికారులు.. విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ రైలు (12727)ను 16, 17 తేదీల్లో రద్దు చేశారు. గురువారం గోదావరి ఎక్స్‌ప్రెస్ మూడు గంటలు ఆలస్యంగా ప్రారంభం కానుంది. అదే విధంగా విశాఖ-విజయవాడ వెళ్లే (12717) రైళ్లు మూడు గంటల పాటు ఆలస్యంగా నేడు బయల్దేరతాయి.

రద్దైన రైళ్ల వివరాలు..

విజయవాడ-విశాఖపట్నం రైలు (12718), విశాఖ- విజయవాడ(12717) రైళ్ల సేవలను 16వ తేదీన రద్దు

విశాఖ-కడప (17488) రైలును 15, 16 తేదీల్లో రద్దు

కడప నుంచి విశాఖ వచ్చే రైలు (17487) సర్వీసులను 16,17 తేదీల్లో రద్దు

విశాఖపట్నం-మహబూబ్‌నగర్‌ (12861) రైలును 15, 16 తేదీల్లో..

మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం (12862) రైలును 16, 17 తేదీల్లో రద్దు

సికింద్రాబాద్‌-విశాఖ (12740) రైలును 15,16 తేదీల్లో రద్దు

విశాఖ తిరుపతి రైలు(22707)ను 15న, తిరుపతి విశాఖ (22708) రైలును 16వ తేదీన రద్దు

గుంటూరు రాయగడ (17243)రైలు 16 తేదీల్లో రద్దు

రాయగడ- గుంటూరు (17244)రైలును 16, 17 తేదీల్లో రద్దు

Updated : 15 Jun 2023 5:24 PM IST
Tags:    
Next Story
Share it
Top