Mega DSC : 6100 పోస్టులతో మెగా డీఎస్సీ..కేబినెట్ ఆమోదం
X
ఏపీ కేబినెట్ సమావేశం బుధవారం జరిగింది. మొత్తం 40 అంశాలు ఎజెండాగా ఏపీ కేబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. 6100 పోస్టులతో డీఎస్సీ-2024 నోటిఫికేషన్ విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే వైఎస్సార్ చేయూత నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంధన రంగంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
ఫిబ్రవరి నెలలో వైఎస్సార్ చేయూత నిధులను విడుదల చేసేందుకు ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు రూ.5 వేల కోట్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. ఇకపోతే 3350 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌కు ఆమోదం లభించింది.
అలాగే ఆగ్వాగ్రీన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 1000 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఎక్రోన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ 1350 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ సిబ్బంది, పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచేందుకు పచ్చజెండా ఊపింది.