Home > ఆంధ్రప్రదేశ్ > వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు...ఏరుకున్న జనం

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు...ఏరుకున్న జనం

వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు...ఏరుకున్న జనం
X

ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం మచిలీపట్నం ప్రాంతంలో కురిసిన కుండపోత వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రధాన రహదారుల్లో వరదనీరు పొంగి పొర్లింది. ఈ వరదలో పాల ప్యాకెట్లు కొట్టుకు వచ్చాయి. పదుల సంఖ్యలో పాలప్యాకెట్లను చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఏ మాత్రం ఆలోచించకుండా వాటిని ఏరుకునేందుకు పోటీపడ్డారు.

మోకాళ్లు లోతు నీటిలో దిగి అందినకాడికి పాల ప్యాకెట్లను తీసుకున్నారు. దీనిని కొంత మంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. సాయిబాబా ఆలయం జంక్షన్‌లో ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల ట్రేలు కిందపడి అవి కొట్టుకువచ్చినట్లు స్థానికులు తెలిపారు. రెండు రోజులుగా ఏపీలోని తీర ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.

Updated : 14 July 2023 4:27 PM IST
Tags:    
Next Story
Share it
Top