త్వరలోనే కారుణ్య నియామకాలు: మంత్రి బొత్స
X
ఏపీ మంత్రి బొత్స కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కారుణ్య నియామకాలు చేపడతామని వెల్లడించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మార్గదర్శకాలు త్వరలో వెలువడతాయని చెప్పారు. ఆగస్టు 7న క్రమబద్ధీకరణపై జీవో ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొత్త జిల్లాల జోనల్ వ్యవస్థ, ఉద్యోగుల సమస్యలపై నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బొత్స తెలిపారు. జోనల్ వ్యవస్థ ఏర్పాటు తుది దశలో ఉందని.. అవసరమైతే ఈ వ్యవస్థపై ఉద్యోగ సంఘాలను సంప్రదిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు.
పవన్‌పై ఫైర్
వలంటీర్ల వ్యవస్థను కించరపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ కల్యాన్‌ను బొత్స హెచ్చరించారు. వలంటీర్ల వ్యవస్థకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో డేటా చోరీ జరిగిందని దానిని ఎన్నికల కోసం వాడుకున్నారని విమర్శించారు. "పవన్ కేంద్రంతో కాకుంటే అమెరికా గత ప్రెసిడెంట్ ఒబామాతో పెట్టుకోవచ్చు.. లేదా ప్రస్తుత ప్రెసిడెంట్ జో- బైడెన్‌తో సంబంధం పెట్టుకోవచ్చు. కేంద్రంతో పరిచయాలున్నాయంటూ పవన్ ఎవర్నీ బెదిరిస్తారు " అని బొత్స అన్నారు.