Home > ఆంధ్రప్రదేశ్ > మార్చి 18 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు

మార్చి 18 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు

మార్చి 18 నుంచి ఏపీ టెన్త్ పరీక్షలు
X

పదో తరగతి, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ను గురువారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో వివరాలు వెల్లడించారు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ను 2024 మార్చి నెలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ముందుగా మార్చి 1 నుంచి మార్చి 15 వరకు ఇంటర్ థియరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించున్నామని అన్నారు. ఒకరోజు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఉంటే.. మరుసటి రోజు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్ష ఉంటుందని చెప్పారు.

ఇక పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి మార్చి 31 వరకు మొత్తం 12 రోజుల పాటు జరగనున్నట్లు మంత్రి తెలిపారు. పదో తరగతి పరీక్షకు 6 లక్షల మంది, ఇంటర్ పరీక్షలకు 10 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు మంత్రి బొత్స తెలిపారు. పరీక్షలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. కాగా వచ్చే ఏడాది లోక్ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో పరీక్షల షెడ్యూల్ ను ముందుకు జరిపినట్లు మంత్రి వెల్లడించారు.


Updated : 14 Dec 2023 4:28 PM IST
Tags:    
Next Story
Share it
Top