Merugu Nagarjuna : కబడ్డీ ఆడుతూ కిందపడ్డ మంత్రి .. స్వల్ప గాయాలు
X
ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో అపశృతి చోటుచేసుకుంది. క్రీడాకారులతో సరదా కబడ్డీ ఆడుతూ మంత్రి మేరుగు నాగార్జున కిందపడటంతో కుడి చేతికి స్వల్ప గాయాలయ్యాయి. మంత్రి నాగార్జునకు స్వల్ప గాయం కావడంతో అక్కడ ఉన్న పోలీస్ అధికారులు అప్రమత్తం అయ్యారు. గాయపడ్డిన మంత్రిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు మంత్రికి ప్రాథమిక చికిత్సను అందించారు. వైద్యులు స్కానింగ్ చేసి రెండు వేళ్లకు ఫ్రాక్చర్ అయినట్టు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మంత్రికి గాయం అవ్వడం బాధాకరమని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు నిర్వహిస్తున్న ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు ప్రారంభయ్యాయి. ఈ పోటీలను గుంటూరు జిల్లాలోని నల్లపాడు వద్ద ఉన్న లయోలా పబ్లిక్ స్కూల్లో సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. డిసెంబర్ 26 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు జరుగుతాయి.ప్రతిభను గుర్తించటం, జాతీయ-అంతర్జాతీయ వేదికలపై పోటీ పడేలా తీర్చిదిద్దడం, క్రీడా స్పూర్తిని పెంపొందించడం లక్ష్యంగా ‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు జరగనున్నాయి.