Home > ఆంధ్రప్రదేశ్ > చిరంజీవి చెబితే వినే పరిస్థితుల్లో లేం...ముందు వాళ్ల తమ్ముడికి చెప్పాలి :రోజా

చిరంజీవి చెబితే వినే పరిస్థితుల్లో లేం...ముందు వాళ్ల తమ్ముడికి చెప్పాలి :రోజా

చిరంజీవి చెబితే వినే పరిస్థితుల్లో లేం...ముందు వాళ్ల తమ్ముడికి చెప్పాలి :రోజా
X

రాష్ట్ర సంక్షేమం గురించి, అభివృద్ధి గురించి, ప్రత్యేక హోదా గురించి ఏపీ ప్రభుత్వం ఆలోచించాలని కానీ, సినిమాల గురించి కాదన్న చిరంజీవి వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి చెబితే వినే పరిస్థితుల్లో లేమని చెప్పారు. సినిమా వేదికలపై రాజకీయాలు మాట్లాడకూడని రోజా సూచించారు. ఏమైనా సలహాలు ఇవ్వాలి అనుకుంటే తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు ఇవ్వాలని హితవు పలికారు. బ్రో సినిమాలో ఏపీ మంత్రి అంబటి రాంబాబు లాంటి క్యారెక్టర్ ని పెట్టి అవమానించడంతో...దానిపై అంబటి ఒక్కరే మాట్లాడారన్నారు. ఈ విషయంపై, సినిమా వాళ్ల రెమ్యూనేషన్లపై ఇంకెవరూ మాట్లాడలేదని స్పష్టం చేశారు.

సినిమా వేదికల మీద రాజకీయాలను ముడిపెట్టి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసేది చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కాదా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రవిడిపోయిన సమయంలో చిరంజీవి కేంద్రమంత్రిగా ఉన్నారని...ఆ సమయంలో ప్రత్యేక హోదా కోసం ఎందుకు పోరాడలేదని నిలదీశారు. కేంద్రమంత్రిగా పనిచేసిన ఆయన ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఏం చేశారన్నారు. నిమాలు చేసే సమయంలో సినిమాలకు పరిమితం కావాలని, రాజకీయం చేసే సమయంలో కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడాలని ఆమె సూచించారు. చిరంజీవి ఏది చెబితే అది విని చేయాల్సిన పరిస్థితిల్లో జగన్మోహన్ రెడ్డి లేరన్నారు.

Updated : 9 Aug 2023 5:53 PM IST
Tags:    
Next Story
Share it
Top