మీరు సింగిల్గా వచ్చినా గుంపులుగా వచ్చినా.. 2024లో జగనే సీఎం: మంత్రి రోజా
X
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఇవాళ (జూన్ 22) తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రోజా.. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నాడో రాష్ట్ర ప్రజలకు అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. ‘పవన్ ఒకరోజు సీఎం అవుతానంటున్నాడు. మరో రోజు ఎమ్మెల్యే పదవి కావాలి అంటున్నాడు. అసలు తనకు ఏం కావాలో క్లారిటో లేకుండా ఉన్నాడ’ని రోజా అన్నారు.
పవన్ కళ్యాణ్.. ‘నువ్వు చంద్రబాబు మాట కాకుండా చిరంజీవి మాట వినాల’ని మంత్రి రోజా అన్నారు. వైసీపీ నాయకులను కొడతానని చెప్పడానికి పార్టీ పెట్టావా? అమ్మవారి పేరుతో యాత్రలు చేస్తూ బూతులు ఎలా మాట్లాడగలగుతున్నావని రోజా అసహనం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టిన వ్యక్తి ప్రజలకు ఏం చేయాలో క్లారిటీ లేకుండా ఉన్నారని రోజా మండిపడ్డారు. పవన్ ను ఉద్దేశించి మాట్లాడిన రోజా.. ‘మీరు సింగిల్గా వచ్చినా గుంపులుగా వచ్చినా.. 2024లో జగనే సీఎం’ అని వ్యాఖ్యానించారు. తనను విమర్శిస్తున్న జనసేన కార్యకర్తల అంతు చూస్తానంటూ రోజా హెచ్చరించారు.