Home > ఆంధ్రప్రదేశ్ > వెంట్రుక కూడా పీకలేవు...పళ్లు రాళ్తాయి..పవన్‌కు రోజా వార్నింగ్

వెంట్రుక కూడా పీకలేవు...పళ్లు రాళ్తాయి..పవన్‌కు రోజా వార్నింగ్

వెంట్రుక కూడా పీకలేవు...పళ్లు రాళ్తాయి..పవన్‌కు రోజా వార్నింగ్
X

వలంటీర్ల వ్యవస్థపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పవన్ కామెంట్స్‌పై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్‌ను మంత్రి రోజా తిట్టిపోశారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా మహిళల అక్రమ రవాణా జరుగుతుందని మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ పవన్ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. పవన్ వలంటీర్ల కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వార్డు మెంబర్ కూడా గెలవలేని పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో ఎవరు సమాచారమిచ్చారని ఎద్దేవ చేశారు. మహిళల అక్రమ రవాణాలో తెలంగాణ 6 స్థానంలో ఉంది.. దీనిపై కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడే దమ్ముందా అని ప్రశ్నించారు.జనసేన వాళ్లను అలగా జనం అన్న బాలకృష్ణ ఇంటర్వ్యూకి సిగ్గులేకుండా పవన్ వెళ్లారంటూ రోజా విమర్శించారు.

ఎన్ని మాట్లాడినా వలంటీర్ వ్యవస్థ వెంట్రుక కూడా పికలేరని ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. వలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడితే పళ్లు రాలగొడ్తారు అంటూ హెచ్చరించారు. సాక్షాత్తు ముస్సోరి IAS సిలబస్ లో వాలంటీర్‌ వ్యవస్థ గురించి పెట్టారు అని గుర్తు చేశారు. జగన్ సర్కార్ తీసుకొచ్చిన వలీంటర్ల వ్యవస్థ అంటే జనసేనకు వణుకు పుడుతుందని చెప్పారు. 2024లో ఓడిపోతామని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అర్ధం అయ్యిందన్నారు. పవన్ కల్యాణ్ కి 55 సంవత్సరాలు వచ్చినా కనీసం ఎంపీటీసీ కూడా కాలేదు. కానీ, సీఎంని ఏక వచనంతో మాట్లాడతా అంటున్నారు.. మీ తల్లి నేర్పిన సంస్కారం ఇదా? అంటూ మండిపడ్డారు. అయితే వెంటనే పవన్ అమ్మను అన్నందుకు క్షమించమని కోరారు. జగన్మోహన్ రెడ్డి అంటేనే క్రియేటర్ అని రోజా కొనియాడారు.


Updated : 11 July 2023 8:43 PM IST
Tags:    
Next Story
Share it
Top