Home > ఆంధ్రప్రదేశ్ > Minister Roja: ఆర్ నారాయణ మూర్తి ప్రధానమంత్రి అయ్యేవాడంటూ మంత్రి రోజా ఎద్దేవా..

Minister Roja: ఆర్ నారాయణ మూర్తి ప్రధానమంత్రి అయ్యేవాడంటూ మంత్రి రోజా ఎద్దేవా..

Minister Roja: ఆర్ నారాయణ మూర్తి ప్రధానమంత్రి అయ్యేవాడంటూ మంత్రి రోజా ఎద్దేవా..
X

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ మంత్రి ఆర్కే రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్‌ ఫ్రస్టేషన్‌ పీక్స్‌కు వెళ్లిందని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు దగ్గర పవన్ ఊడిగం చేస్తున్నాడంటూ విమర్శలు చేశారు. ఈ విమర్శలు చేసే క్రమంలో రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని ప్రముఖ వ్యక్తిని అవమానిస్తూ మాట్లాడారు రోజా.

ఆవేశానికి, అరుపులకు ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలని అంటూనే.. అలా అయితే ఆర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యేవారని రోజా ఎద్దేవా చేశారు. రాజకీయంగా రోజా.. పవన్ పై ఎలాంటి విమర్శలైనా చేయొచ్చు కానీ.. సమాజం కోసం సర్వం త్యాగం చేసేందుకు కూడా వెనకాడని ప్రముఖ విప్లవ సినీనటుడు ఆర్ నారాయణ మూర్తి గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం సరికాదంటున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. రోజా పై కామెంట్ల రూపంలో విరుచుకుపడుతున్నారు. అసలు ఆర్ నారాయణ మూర్తి గారికి రాజకీయాలకు ఏం సంబంధం ఉంది. ఆయన సినిమాల్లో అరుస్తారు.. కాని ఆయన తీసే ప్రతి సినిమా సమాజానికి పనికి వచ్చేలా ఉంటుంది. మీలా పదవుల కోసం ఒకరికి భజన చెయ్యరు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇక పవన్ కళ్యాణ్‌.. చంద్రబాబు వద్ద ఊడిగం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు రోజా . ముష్టి 30 సీట్లు కూడా పవన్ కళ్యాణ్‌ తీసుకోలేకపోయారని అన్నారు. అలాంటి వ్యక్తికి సీఎం జగన్‌ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని గాలికి వదిలేసి పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలను మోసం చేస్తున్నారని అన్నారు. పైగా పార్టీ కేడర్‌ను తప్పుపట్టడం ఏంటి అని మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ ఊగిపోయి మాట్లాడుతున్నారనీ..అలా మాట్లాడినంత మాత్రాన ఓట్లు రావనే విషయాన్ని గ్రహించాలని సూచించారు.

Updated : 29 Feb 2024 5:56 PM IST
Tags:    
Next Story
Share it
Top