Home > ఆంధ్రప్రదేశ్ > బామ్మర్దిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా?.. CBNపై రోజా కామెంట్స్

బామ్మర్దిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా?.. CBNపై రోజా కామెంట్స్

బామ్మర్దిలా మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా?.. CBNపై రోజా కామెంట్స్
X

ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడుకు ఐటీ నోటీసుల అంశం హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబుకు ఐటీ నోటీసులు వచ్చాయని.. వాటిని ఆయన గానీ, టీడీపీ నాయకులకు గానీ ఎందుకు స్పందించడం లేదని ఏపీ మంత్రులు, వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నార. చంద్రబాబు పేరు వింటే చాలు అంతెత్తున ఎగిరిపడే ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా కూడా ఈ విషయంలో చంద్రబాబును తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు ఐటీ నోటీసుల విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం వహిస్తున్నారని కూడా రోజా ప్రశ్నిస్తున్నారు. పవన్ మూతికి హెరిటేజ్ ప్లాస్టర్ వేసుకున్నాడా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. బీజేపీ చీఫ్ గా పురంధేశ్వరి కూడా మాట్లాడకుండా ఉండటం సరికాదన్నారు. త్వరలోనే చంద్రబాబు, లోకేశ్ జైలుకెళ్లడం ఖాయం అన్నారు .





”చంద్రబాబు, లోకేశ్ తోడు దొంగలు. దోచుకున్నది హైదరాబాద్ లోని తమ ఇంట్లో దాచుకున్నారు. అందుకే తేలు కుట్టిన దొంగలలాగా ఉన్నారు. ప్రశ్నించడానికే నేను పార్టీ పెట్టా అని చెప్పే పవన్ కల్యాణ్.. ఎందుకు ప్రశ్నించడం లేదు? బీజేపీ పార్టీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఎందుకు మాట్లాడటం లేదో అని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ అనుమానంగా ఉంది. పురంధేశ్వరి భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలా? లేక బాబు జనతా పార్టీ అధ్యక్షురాలా? అని ప్రజలంతా డౌట్ పడుతున్నారు" అని అన్నారు. ఇక సోషల్ మీడియాలో "ముడుపుల కేసులో .... ధైర్యంగా విచారణ ఎదుర్కొంటాడా..? లేక..బామ్మర్దిలా .... మెంటల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడా ?రామోజీలా .... మంచం ఎక్కుతాడా ?అచ్చన్నలా .... రమేష్ ఆసుపత్రిలో చేరతాడా ?విజయ్ మాల్యాలా..... విదేశాలకు పారిపోతాడా ?ఇవన్నీ కాక ఎప్పటిలానే .... మరో స్టే తెచ్చుకుంటాడా ?అని ...పలువురు గుసగుస !" అంటూ ట్వీట్ చేశారు.

మరో ట్వీట్ లో "అమ‌రావ‌తిలో తాత్కాలిక ప్ర‌భుత్వ భ‌వ‌నాల నిర్మాణంలో చంద్రబాబు పుచ్చుకున్న రూ.118.98 కోట్ల ముడుపులు 2019వ సంవ‌త్స‌రం త‌ర్వాత వ‌చ్చిన‌ట్టు తేలింది. మ‌రి 2019కి ముందు 2014 నుంచి 2018 వ‌ర‌కూ డొల్ల కంపెనీల రూపంలో ఎన్ని కోట్ల ప్ర‌జాధనాన్ని దోచుకున్నారో ఈ అబ్బాకొడుకులు?" అని ప్రశ్నించారు రోజా.




Updated : 7 Sept 2023 11:22 AM IST
Tags:    
Next Story
Share it
Top