Minister Roja: భోగి మంటల్లో టీడీపీ-జనసేన మేనిఫెస్టోను తగలబెట్టండి
X
ఏపీలో అధికార పార్టీ నేతలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు... భోగి వేడుకల్లో డ్యాన్స్ స్టెప్పులేసి అదరగొట్టారు. ఇక మరో మంత్రి రోజా.. నగరిలో తన నివాసం వద్ద భర్త సెల్వమణితో కలిసి భోగి మంటలు వేసి, పండుగ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి అందరి జీవితాల్లో భోగభ్యాగ్యాలు వెలుగులు నింపాలని ఆశించారు. జగనన్న సుపరిపాలనలో రైతులు, మహిళలంతా సంతోషంగా సంక్రాంతి జరుపుకుంటున్నారన్నారు. ప్రజలందరూ టీడీపీ- జనసేన పార్టీల చెత్త మ్యానిఫెస్టోని, చెత్త మాటలను భోగి మంటల్లో వేసి తగలపెడుతున్నారు. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఊర్లకు వచ్చినట్లు చంద్రబాబు, పవన్ వచ్చారు. ఇక, హైదరాబాద్ నుంచి వచ్చిన ఇద్దరు నాన్ లోకల్ నేతలు భోగి వేస్తున్నారు అని ఆమె విమర్శలు గుప్పించారు. భోగి పండగ, 2024 ఎన్నికలు అవ్వగానే మళ్ళీ హైదరాబాద్ కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు వెళ్ళిపోతారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు, పవన్ లను తగలబెట్టి, తరిమేయండి అని మంత్రి రోజా పిలుపునిచ్చారు. మా పార్టీని భోగిమంటల్లో తగుల పెడతామని టీడీపీ నేతలు చెబుతున్నారు. 2019లోనే మిమ్మల్ని తగులు పెట్టారు అనేది గుర్తు పెట్టుకోండి. వచ్చే ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది. జగనన్న వన్స్ మోర్ అంటూ ఏపీ ప్రజలంతా నినాదాలు చేస్తున్నారు అని మంత్రి రోజా వెల్లడించారు.