Home > ఆంధ్రప్రదేశ్ > రైతు ఇంట మిరాకిల్..12 ఏళ్లుగా పాలిస్తున్న ఆవు

రైతు ఇంట మిరాకిల్..12 ఏళ్లుగా పాలిస్తున్న ఆవు

రైతు ఇంట మిరాకిల్..12 ఏళ్లుగా పాలిస్తున్న ఆవు
X

ఆవు ఇంట్లో ఉంటే సిరుల పంట అంటారు. దాదాపు గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారు వారి ఇంట్లో తప్పక ఆవులను పెంచుకుంటుంటారు. ఆవు ఈనిన ప్రతిసారి అవి ఇచ్చే పాలను కొంత కాలం పాటు తాగుతూ ఆరోగ్యంగా ఉంటారు. మళ్లీ అది ఈనే వరకు ఎదురుచూస్తారు. కానీ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం దేవనబండ గ్రామంలోని ఓ రైతు ఇంట్లో ఉండే ఓ ఆవు మాత్రం నిరంతరం పాలను అందిస్తూ చుట్టుపక్కన వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 ఏళ్లుగా నాన్ స్టాప్ ఆ రైతు ఇంట్లో ఆవు పాలను ఇస్తోంది. నిజానికి ఒక ఆవు ఈనిన తరువాత కొన్ని నెలలు మాత్రమే పాలిస్తుంది. అలాంటిది ఓ జెర్సీ ఆవు ఇన్నేళ్లు పాలు ఇవ్వడం అంటే ఓ మిరాకిల్ అని భావిస్తున్నారు గ్రామస్థులు.

దేవనబండ గ్రామానికి చెందిన నాగప్ప 12 ఏళ్ల క్రితం ఓ జెర్సీ ఆవును కొన్నాడు. తన దగ్గరికి వచ్చినప్పటి నుంచి 4 దూడలను ఈనింది. 6 ఏళ్ల క్రితమే చివరి ఈత కూడా పూర్తైంది. అయినా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు అది పాలు ఇస్తూనే ఉంది. అది కూడా ప్రతి రోజూ 4 లీటర్లకు తగ్గకుండా పాలు అందిస్తుండటం దీని స్పెషాలిటీ. ఈతలు లేకుండా పాలధారలు పారిస్తుండటంతో గ్రామస్థులు ఆశ్చర్యపోతున్నారు. పైగా ఏ సమయంలో పితికినా పాలు ఇస్తుండటంతో నాగప్ప సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయాన్ని వెటర్నరీ డాక్టర్ల దృష్టికి తీసుకెళ్లారు. అయితే కొన్ని రకాల జెర్సీ ఆవుల్లో ఈతలు లేకున్నా పాలిచ్చే లక్షణాలు ఉంటాయని వారు తెలియజేశారు.

Updated : 25 Jun 2023 6:40 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top