Home > ఆంధ్రప్రదేశ్ > పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి.. ద్వారంపూడి ఘాటు కౌంటర్‌

పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి.. ద్వారంపూడి ఘాటు కౌంటర్‌

పవన్‌ ఓ రాజకీయ వ్యభిచారి.. ద్వారంపూడి ఘాటు కౌంటర్‌
X

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక రాజకీయ వ్యభిచారి అని వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. జనసేన పార్టీని ఎవరిని ఉద్ధరించడానికి పెట్టాడని ప్రశ్నించారు. వారాహి యాత్రలో భాగంగా ఆదివారం సర్పవరం జంక్షన్‌ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు ద్వారంపూడి. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను ఓడిస్తానన్న పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. 'నిన్ను తుక్కు తుక్కుగా ఓడించకపోతే నాపేరు చంద్రశేఖర్ రెడ్డి కాదు.. నాపై గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. ఓడిపోతే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా' అంటూ ఛాలెంజ్ చేశారు. తాను మూడు సార్లు పోటీ చేస్తే.. రెండు సార్లు గెలిచానని అన్నారు. పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఒక్కచోట కూడా గెలవలేదని ఎద్దేవా చేశారు. తనను విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్‌కు లేదన్నారు. పొలిటికల్‌గా పవన్ జీరో అని విమర్శించారు.

కులాల ప్రస్తావన లేకుండా పవన్ కల్యాణ్ ప్రసంగం ఉండదని ద్వారంపూడి అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లను ఏపీ నుంచి తరిమిస్తే.. అన్ని కులాలు కలిసి ఉంటాయని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు అని విమర్శించారు. పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. పవన్ ఇష్టమెచ్చినట్టుగా మాట్లాడితే.. తాము చేతల్లో చూపిస్తామని అన్నారు. పవన్ తన అన్న పేరు చెప్పుకొని వచ్చాడని.. కానీ తాము మెట్టు, మెట్టు ఎక్కి పైకి వచ్చామని చెప్పారు. పవన్ గురించి పూనమ్ కౌర్, రేణు దేశాయ్ మాట్లాడుతున్నారని.. అవసరమైతే తాము పవన్ కల్యాణ్‌ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడతామని అన్నారు.


పవన్ కల్యాణ్ చాలెంజ్‌ను తాను స్వీకరిస్తున్నానని.. దమ్ముంటే కాకినాడ నుంచి పోటీ చేయాలని సవాలు విసిరారు. జనసేన పార్టీ నుంచి తనపై పోటీ చేస్తే తుక్కు తుక్కుగా ఓడించకపోతే తన పేరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డినే కాదని అన్నారు. పవన్ ఓడిపోతే రాజకీయాల్లో నుంచి తప్పుకోవాలని.. తాను ఓడిపోతే తాను తప్పుకుంటానని సవాలు విసిరారు. వేరే వాళ్లు పోటీకి వస్తే పవన్ కల్యాణ్‌ను పిరికివాడిగా భావించాల్సి ఉంటుందని చెప్పారు. రాబోయే రోజుల్లో తానేంటో చూపిస్తానని.. ఈరోజు నుంచి పవన్ పతనం ప్రారంభమైందని చెప్పారు. పవన్ కల్యాణ్ వెనక తాగుబోతు కుక్కలు ఉన్నారని విమర్శించారు. తన ఇంటి మీద దాడి చేస్తే తాను ఎందుకు ఊరుకుంటానని ప్రశ్నించారు. తాము వీర మహిళలపై దాడి చేయలేదని.. వాళ్లే తమను పచ్చి బూతులు తిట్టారని అన్నారు. అలా చేస్తుంటే వారిని తమవాళ్లు తీసుకెళ్లి గుడిలో పెట్టడం జరిగిందని చెప్పారు. తాము కూడా సినిమా ఫీల్డ్‌లో ఉన్నామని.. ఎగ్జిబిటర్‌లుగా చేశామని చెప్పారు. చిరంజీవి, పవన్ సినిమాలు ఎక్కువగా తమ థియేటర్లలో నే ఆడాయని తెలిపారు. పవన్ చరిత్ర గురించి తనకు బాగా తెలుసునని.. కావాలంటే బయటపెడతానని చెప్పారు. పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యే కావాలన్నా.. సీఎం కావాలన్నా అది సినిమాల్లోనే సాధ్యమవుతుందని ఎద్దేవా చేశారు.

Updated : 19 Jun 2023 8:18 AM GMT
Tags:    
Next Story
Share it
Top