హనీరోజ్ మీటింగ్ పెడితే.. పవన్ మీటింగ్ కంటే ఎక్కువ జనం వస్తారు: కేతిరెడ్డి
X
రాజకీయాల్లో ఉన్నవాళ్లు తమ గెలుపు కోసం ప్రయత్నించాలే తప్ప.. వేరేవాళ్ల పల్లకి మోయకూడదని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సెటైర్లు వేశారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సినిమాలు, రాజకీయాలు రెండు వేరువేరని పేర్కొన్నారు. తిరుపతిలో హీరోయిన్ హనీ రోజ్ తో మీటింగ్ పెడితే.. పవన్ కళ్యాణ్ మీటింగ్ కంటే ఎక్కువ జనాలు వస్తారని తెలిపారు. పవన్ అన్న చిరంజీవి చాలా మంచివాడైనా.. పాలకొల్లులో ఓడిపోయాడని గుర్తు చేశారు.
బాలకృష్ణ తెలివైన వాడని, అందుకే సొంత ఊళ్లో పోటీ చేయకుండా తప్పించుకున్నాడని అన్నారు. చంద్రబాబు ఏడు సార్లు దొంగ ఓట్లతోనే ఎమ్మెల్యేగా గెలిచాడని ఆరోపించారు. కుప్పంలో పూర్తి స్థాయిలో దొంగ ఓట్లను తొలగిస్తే.. చంద్రబాబు రాజకీయ తప్పుకోవల్సి వస్తుందని తెలిపారు. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్ లో 30 నుంచి 40 వేల దొంగ ఓట్లు ఉన్నాయన్న ఆయన.. ధర్మవరంలో 14వేల దొంగ ఓట్లను ఎన్నికల సంఘం గుర్తించిందని స్పష్టం చేశారు. లోకేష్ పాదయాత్ర చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు.