Home > ఆంధ్రప్రదేశ్ > సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తా...ఏలూరు కలెక్టర్ కు పేర్నినాని వార్నింగ్..

సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తా...ఏలూరు కలెక్టర్ కు పేర్నినాని వార్నింగ్..

సీఎం జగన్ ఇంటి ముందు ధర్నా చేస్తా...ఏలూరు కలెక్టర్ కు పేర్నినాని వార్నింగ్..
X

ఏపీ మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకంగా సీఎం జగన్ఇంటి ముందు, సీఎస్ ఆఫీస్ ఎదుట ధర్నా చేస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఉమ్మడి పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ రాకపోవడంపై పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

బుధవారం ఉమ్మడి పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి ఆర్కే రోజా జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, కొత్త జిల్లాల కలెక్టర్లు, అధికారులు హాజరయ్యారు. ఉమ్మడి కృష్ణా జెడ్పీ సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హాజరుకావాల్సి ఉండగా ఆయన డుమ్మా కట్టారు. గతంలోనూ జెడ్పీ సర్వసభ్య సమావేశానికి ఆయన రాకపోవంతో ఎమ్మెల్యే పేర్ని నాని కోపం కట్టలు తెంచుకుంది.

కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని..మరీ ఇంత నిర్లక్ష్యం పనికిరాదంటూ మండిపడ్డారు. వ్యవస్థలను లెక్కచేయకపోవడం సరికాదని...నియంతలా వ్యవహరించవద్దని సూచించారు. బరితెగింపుతనం ఏ స్థాయి అధికారికి కూడా మంచిది కాదని అన్నారు. మరోసారి జెడ్పీ సమావేశానికి రాకుంటే జిల్లాకు చెందిన జెడ్పీటీసీ మెంబర్లందరితో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి వద్ద ధర్నా చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు కలెక్టర్, ఇతర అధికారుల తీరును సీరియస్‎గా తీసుకోవాలని జడ్పీ ఛైర్ పర్సన్ కు సూచించారు. ఇదే అంశంపై సమావేశంలో తీర్మానం కూడా చేయాలని పేర్నినాని డిమాండ్ చేశారు. అధికారి పార్టీ ఎమ్మెల్యే ఓ కలెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేయడం, నిరసనకు దిగుతా అని చెప్పడం చర్చనీయాంశమైంది.


Updated : 19 July 2023 5:16 PM IST
Tags:    
Next Story
Share it
Top