AP Politics : వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంటికి వచ్చి మరీ తంతా.. MP కి MLC వార్నింగ్
X
ఏపీ విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణపై జనసేన నేత, ఎమ్మెల్సీ వంశీయాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ జీవితాన్ని ఎంపీ దెబ్బకొట్టారని భావిస్తున్న ఎమ్మెల్సీ వంశీయాదవ్.. ఎంవీవీపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు ఎంవీవీ. ఆయన ప్రత్యర్ధిగా హ్యాట్రిక్ ఎమ్మెల్సీ వెలగపూడి రామకృష్ణబాబు బరిలోకి దిగుతున్నారు. జనసేన-టీడీపీ పొత్తుల కారణంగా ఉమ్మడి అభ్యర్ధి అయిన రామకృష్ణబాబు విజయం కోసం కలిసి పని చేస్తామని వంశీయాదవ్ ప్రకటించారు.
అదే సమయంలో తనకు రాజకీయ, వ్యక్తిగత ప్రత్యర్ధిగా భావిస్తున్న ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు వంశీ యాదవ్. తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇంటికి వచ్చి మరీ తంతానని.. ముఖ్యమంత్రి కాదు కదా దేవుడు వచ్చిన కాపాడలేడని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.. తాజాగా.. ఎమ్మెల్సీ వ్యాఖ్యలను ఎంవీవీ సీరియస్‌గా తీసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై విశాఖ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా ఎమ్మెల్సీ వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాగా, ఇటీవల జనసేన పార్టీలో చేరిన వంశీకృష్ణ.. తనకు ప్రత్యక్ష రాజకీయాల్లో కొనసాగాలని ఉందని.. అందుకే తాను వైసీపీ నుంచి జనసేనలో చేరానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వెల్లడించారు. తాను రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి, 10 సైట్లు అమ్ముకున్నానని.. తన రాజకీయ భవిష్యత్ నాశనం కావడానికి వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కారణమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన్ను ఓడించడమే తన లక్ష్యమని వంశీకృష్ణ యాదవ్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.