ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
X
కుటంబ కలహాలు ప్రాణాలు తీసేస్తున్నాయి. చిన్నచిన్న కారణాలకే భార్యభర్తలు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. వారితో పాటు పసిమొగ్గలను సైతం చిదిమేస్తున్నారు. తాజాగా మరొక ఘటన తిరుపతి జిల్లాలో చోటుచేసుకుంది. అభం శుభం తెలియని ఇద్దరు పిల్లలను చంపి..తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు చెబుతున్నారు.
ఈదులగుంట కాలనీలో భార్య శివమ్మ, శివయ్య దంపతులు ఉంటున్నారు. శివయ్య ఓ ఆటో డ్రైవర్. వీరి మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్నాయి. ఈక్రమంలోనే గురువారం రాత్రి మరోసారి భార్యభర్తలు గొడవపడ్డారు. దీంతో తీవ మనస్థాపానికి గురైన భార్య శివమ్మ..ఇద్దరు పిల్లకు ఉరివేసి..తర్వాత తాను ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన కుటుంబసభ్యులు ముగ్గురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త శివయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.