Home > ఆంధ్రప్రదేశ్ > వైఎస్ వివేకా కేసు...సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

వైఎస్ వివేకా కేసు...సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ

వైఎస్ వివేకా కేసు...సీబీఐ డైరెక్టర్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ
X

వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఉత్కంఠ రేపుతోంది. రోజుకో విషయం వెలుగు చూస్తుండడంతో ఈ అంశంపై ఆసక్తి నెలకొంది. ఇటీవల పలువురు సీబీఐ కోర్టుకు సమర్పించి వాంగ్ములాలు బయటకు వచ్చి సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌కు ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వివేకా కేసును గతంలో విచారించిన ఎస్పీ రామసింగ్‎పై లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు.

పక్షపాత వైఖరితో రాంసింగ్ దర్యాప్తు సాగిందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. రాంసింగ్ జరిపిన దర్యాప్తును సమీక్షించాలని కోరారు. వివేకా రెండో వివాహం, బెంగళూరు ల్యాండ్ సెటిల్మెంట్ అంశాలను అవినాష్ రెడ్డి లేఖలో ప్రస్తావించారు. దస్తగిరి నిలకడలేని సమాధానాల ఆధారంగా రాంసింగ్ విచారణ జరిపారని అవినాష్ రెడ్డి తెలిపారు. రెండో భార్య పేరుతో ఉన్న ఆస్తి పత్రాలను ఎత్తుకెళ్లడానికే హత్య చేసి ఉండొచ్చన్న కోణంలో విచారణ జరగలేదని వివరించారు. మున్నా లాకర్లో నగదుకు సంబంధించిన వివరాలు సీబీఐకి ఎవరు చెప్పారని ప్రశ్నించారు. రాంసింగ్ విచారణలో చేసిన తప్పులను సవరించాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. నిజమైన నేరస్తులను పట్టుకుని న్యాయం చేయాలని సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్‌ను అవినాష్ రెడ్డి కోరారు.


Updated : 23 July 2023 1:52 PM GMT
Tags:    
Next Story
Share it
Top