వైసీపీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ.. ఆ అసెంబ్లీ బరిలో !
X
కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ ముద్రగడ, ఆయన కుమారుడు గిరికి వైసీపీ కండువా కప్పారు. ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓటర్లను ఆకట్టుకునేందుకు సీఎవ జగన్ ముద్రగడ సేవలను వినిగించుకోనున్నట్లు తెలుస్తోంది. గతంలో ముద్రగడ ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పని చేశారు.పద్మనాభం వాస్తవానికి ఈనెల 14నే వైసీపీలో చేరాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రూట్ మ్యాప్ సైతం విడుదల చేశారు. అయితే తనతోపాటు తాడేపల్లి చేరుకునే వారి సంఖ్య భారీగా ఉండటంతో అవన్నీ రద్దు చేసుకున్నారు. ఈ క్రమంలో వైసీపీలో చేరే తేదీని ముద్రగడ పద్మనాభం వాయిదా వేశారు. ఈనెల 15న వైసీపీలో చేరబోతున్నట్లు తెలియజేస్తూ నిన్న లేటర్ విడుదల చేశారు. ఈ అంతరాయానికి సంబంధించి ప్రజలను శిరస్సు వంచి క్షమించమని ముద్రగడ కోరారు.
జగన్ ఆహ్వానం మేరకు వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నానని అయితే ఊహించని దానికన్నా భారీస్థాయిలో స్పందన రావడంతో సెక్యూరిటి ఇబ్బంది వల్ల నిర్ణయం మార్చుకున్నట్లు లేఖలో ముద్రగడ పద్మనాభం తెలిపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేయబోతున్న మంగళగిరిపై ఇప్పటికే వైసీపీ ఫోకస్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే వచ్చే ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆ నియోజకవర్గంపైనా ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తెరపైకి కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను తెరపైకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజవర్గంలో గెలుపును ప్రభావితం చేసేది కాపు సామాజిక వర్గం ఓటర్లు. ఒకవేళ పవన్ కల్యాణ్ పోటీ చేస్తే కాపులంతా పవన్‌కు ఓటేస్తే ఈజీగా గెలుస్తారనే టాక్ ఉంది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్‌ను ఢీకొట్టాలంటే అది కేవలం కాపుఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వల్లే సాధ్యం అని వైసీపీ భావిస్తోంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.