Home > ఆంధ్రప్రదేశ్ > ముత్తిరెడ్డి కూతురు మరోసారి సంచలన వ్యాఖ్యలు..

ముత్తిరెడ్డి కూతురు మరోసారి సంచలన వ్యాఖ్యలు..

ముత్తిరెడ్డి కూతురు మరోసారి సంచలన వ్యాఖ్యలు..
X

జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి ఆమె కూతురుతో వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇప్పటికే పలు మార్లు ఈ అంశం రోడ్డెక్కగా తాజాగా మరోసారి ముత్తిరెడ్డిపై కుమార్తె తుల్జాభవానీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి అవినీతిపరుడని ఆరోపించారు. అవినీతిపరులకు పార్టీ టిక్కెట్ ఇవ్వకూడదని సూచించారు. సొంతంగా పోటీ చేసినా సర్పంచ్‌గా కూడా తన తండ్రి గెలవలేడన్నారు. కేవలం కేసీఆర్ పేరు చెప్పుకొని ఎన్నికల్లో గెలిచారని విమర్శించారు. అసలు ఆయనను ప్రజలు ఎందుకు ఎన్నుకున్నారో తెలియదని వ్యాఖ్యానించారు.

రాజకీయరంగప్రవేశంపై తుల్జాభవానీరెడ్డి స్పందించారు. తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని...తన వెనుక ఏ పార్టీ లేదని స్పష్టం చేశారు. తన తండ్రి కబ్జా చేస్తే అతనిని వదిలేసి..తమను కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బాధితులు ఫోన్ చేస్తున్నారని, బయటకొస్తున్నారని ఆమె చెప్పారు. ఎమ్మెల్యేను ప్రశ్నించాల్సింది.. ఓడించాల్సింది ప్రజలే అన్నారు. ప్రజల ఆస్తిని తాను తిరిగి ఇచ్చేసినట్లు చెప్పారు. తన తండ్రి నుండి రూపాయి కూడా తాను తీసుకోలేదన్నారు. కుటుంబం నుండి తనకు ఎలాంటి మద్దతు లేదని తెలిపారు.

Updated : 17 July 2023 9:15 PM IST
Tags:    
Next Story
Share it
Top