Chandrayan-3: చంద్రయాన్-3 ప్రయోగం..ఏపీ సీఎం జగన్ ట్వీట్
X
ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తితో శ్రీహరికోటవైపు చూస్తోంది. ఇస్రో బాహుబలి చంద్రయాన్-3 చందమామను తాకేందుకు సిద్ధమైంది. లక్ష్యం కోసం అలుపెరుగని పోరాటాన్ని మొదలుపెట్టబోతోంది. మరి కొన్ని గంటల్లో నిప్పులు చిమ్మకుంటూ భారత అంతరిక్షనౌక నింగిలోకి ఎగరబోతోంది. చంద్రయాన్–3 మిషన్‌ను చంద్రుని దక్షిణ ధ్రువంపైకి పంపేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. శ్రీహరికోట, షార్‌లోని రెండవ ప్రయోగవేదిక నుంచి ఇవాళ మధ్యాహ్నం 2.35 గంటలకు ఈ ప్రయోగం జరగనుంది.
ఈ క్రమంలో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగం గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. రాకెట్ ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో బృందానికి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇప్పటి వరకు ఎవరూ అడుగుపెట్టని జాబిల్లి దక్షిణ దిశను ముద్దాడేందుకు , తన చిరకాల లక్ష్యాన్ని సాధించేందుకు ఇస్రో చేస్తున్న ఈ ప్రయోగానికి ఆల్ ది బెస్ట్ చేప్పారు.
ఈ మిషన్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి నాలుగేళ్ల క్రితం నాటి చంద్రయాన్–2 పరాజయం తాలూకు చేదు జ్ఞాపకాలను చెరిపేయాలని గట్టి పట్టుదలతో ఇస్రో ఉన్నట్లు తెలుస్తోంది. అందకే భారత్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటి కళ్లూ శ్రీహరికోటవైపు చూస్తున్నాయి.
My best wishes to the entire team at @isro on the scheduled launch of Chandrayaan-3 from Sriharikota in our very own #AndhraPradesh today.
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 14, 2023