Vizag beach mystery box: విశాఖ బీచ్కు కొట్టుకొచ్చిన మిస్టరీ బాక్స్.. అందులో ఏముందంటే?
X
విశాఖ బీచ్ ఒడ్డుకు ఓ భారీ పెట్టె కొట్టుకొచ్చింది. దాదాపు 100 టన్నుల బరువున్న ఈ చెక్క పెట్టె సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొచ్చింది. శుక్రవారం (సెప్టెంబర్ 29) రాత్రి వైఎంసీఏ బీచ్ లో ఈ భారీ చెక్క పెట్టె కనిపించింది. ఇది గమనించిన స్థానికులు, మత్స్య కారులు పోలీసులకు సమాచారం అదించారు. దీంతో హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పెట్టెను పరిశీలించి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కు సమాచారం అదించారు. ఆ బాక్స్ రహస్యాన్ని చేందించేందుకు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సుమారు 100 టన్నులున్న ఆ పెట్టెను క్రేన్ సాయంతో లారీలోకి ఎక్కించి తరలించారు. అయితే దీన్ని బ్రిటిష్ కాలం నాటిదిగా భావిస్తున్నారు. ఓ మిస్టరీ బాక్స్ ఒడ్డుకు కొట్టుకొచ్చిందనే వార్త వినగానే.. దాన్ని చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు. ప్రస్తుతం ఈ వార్త విశాఖ మొత్తం హాట్ టాపిక్ గా మారింది. ఆ పెట్టెలో ఏముందని తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు జనాలు. ప్రస్తుతం ఆ పెట్టెను ఆర్కియాలజీ విభాగం తీసుకెళ్లి పరిశీలిస్తుంది.