సీఎం జగన్కు నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్
X
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు జనసేన నేత, ప్రోడ్యూసర్ నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ప్రతిపక్షాలపై జగన్ చేసిన విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. సభలో జగన్ సైకిల్ ఇంటి బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్ లోనే ఉండాలి, కానీ ఇంట్లో ఎప్పుడూ ఫ్యాన్ తిరుగుతూనే ఉండాలని అన్నారు. ఈ వ్యాఖ్యలపై జనసేన నేత నాగబాబు ఘాట్ గా స్పందించారు.
గ్లాస్ సింక్ లో ఉన్నా కూడా తెల్లారితే మళ్లీ తేనేటి విందు ఇస్తుందని అన్నారు. కానీ, ఫ్యాన్ రెక్కలు విరిగితే విసనకర్ర ఇచ్చినంత గాలి కూడా ఇవ్వదంటూ జగన్ ను ఉద్దేశించి నాగబాబు సెటైర్ వేశారు. అయినా సారూ.. మీరు పబ్లిక్ మీటింగ్స్ లలో ప్రాసలు, పంచుల మీద పెట్టిన శ్రద్ధలో సగం ‘ప్రజాపరిపాలన’ మీద పెట్టుంటే బాగుండేదంటూ సీఎం జగన్ కు చురకలు అంటించారు. చివరగా అయామ్ టెల్లింగ్ దట్.. అంటూ కింగ్ మూవీలోని డైలాగ్ ను ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై జన సైనికులు కామెంట్లు పెడుతున్నారు.