Home > ఆంధ్రప్రదేశ్ > NagaBabu : వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నాగబాబు షాకింగ్ కామెంట్స్

NagaBabu : వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నాగబాబు షాకింగ్ కామెంట్స్

NagaBabu : వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై నాగబాబు షాకింగ్ కామెంట్స్
X

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికలకు ఎక్కువ సమయం కూడా లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డాయి. ఈసారి అధికార పార్టీ అయిన వైసీపీకి జనసేన, టీడీపీలు గట్టిపోటీ ఇవ్వనున్నాయి. బీజేపీ కూడా జనసేన, టీడీపీలతో పరోక్షంగా టచ్‌లోనే ఉంటూ వాటికి మరింత బలాన్ని ఇస్తోంది. జనసేన పార్టీ నేతలు ఈ తరుణంలో వైసీపీపై, సీఎం జగన్‌పై విమర్శలు గుప్పిస్తూ ముందుకు సాగుతోంది. తాజాగా జనసేన నేత నాగబాబు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారు.

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన కొణిదెల నాగబాబు అనకాపల్లిలోని అచ్యుతాపురంలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ తరుణంలో అక్కడ ఇల్లు తీసుకోవడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అచ్యుతాపురం కేంద్రంగా నాగబాబుతో పాటు ఇతర సిబ్బంది ఉండేందుకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగబాబు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

నాగబాబు మాట్లాడుతూ.. దేశంలోనే ధనిక సీఎంగా ఉన్న జగన్ పేదోడికి, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటుంటే నవ్వు ఆగట్లేదని ఎద్దేవా చేశారు. పదుల సంఖ్యలో ప్యాలెస్‌లు, వేల కోట్ల బ్యాలెన్సులు ఉన్న పేదవాడు జగన్ అని, ఇది ఎంతో సీరియస్ మ్యాటర్ అని, ఎవ్వరూ నవ్వకండని నాగబాబు విమర్శించారు. వైసీపీ ఎంపీల ఆస్తులు రూ. 4,766 కోట్లు, వైసీపీ ఎమ్మెల్యేల ఆస్తులు రూ. 3,379 కోట్లు ఉన్నాయని, దేశంలోనే 3వ అత్యధిక ఆస్తులు కలిగిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీవారేనని, ఇది ప్రతి ఒక్కరూ నమ్మాల్సిన నిజం అని అన్నారు. ఈసారి వైసీపీని ఇంటికి పంపేందుకు అందరూ సిద్ధమయ్యారని నాగబాబు చెప్పుకొచ్చారు.

Updated : 17 Feb 2024 3:02 PM IST
Tags:    
Next Story
Share it
Top