అసెంబ్లీలో బాలయ్య హల్చల్.. విజిల్ వేస్తూ..
X
ఏపీ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని తిరస్కరించారు. దీంతో స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో బాలకృష్ణ విజిల్ వేస్తూ హల్ చల్ చేశారు. చంద్రబాబు సీటు ఎక్కి ఆయన విజిల్ ఊదారు. చంద్రబాబుపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ ఆందోళనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ ఇద్దరు సభ్యులను సస్పెన్షన్ చేశారు. అచ్చెన్నాయుడు, అశోక్ లను సెషన్ ముగిసేవరకు స్పీకర్ సస్పెన్షన్ వేశారు. ఇక టీడీపీ నేతల తీరుపై మంత్రులు ఫైర్ అయ్యారు. నోరు అదుపులో పెట్టుకోవాలని.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇది టీడీపీ ఆఫీస్ కాదని.. అసెంబ్లీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. టీడీపీ నేతలకు దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ విసిరారు.