Home > ఆంధ్రప్రదేశ్ > Chandrababu: చంద్రబాబు ఏం తప్పు చేశాడని జైలులో పెట్టారు - నారా భువనేశ్వరి

Chandrababu: చంద్రబాబు ఏం తప్పు చేశాడని జైలులో పెట్టారు - నారా భువనేశ్వరి

Chandrababu: చంద్రబాబు ఏం తప్పు చేశాడని జైలులో పెట్టారు - నారా భువనేశ్వరి
X

"చంద్రబాబు ఏం తప్పు చేశారని జైలులో పెట్టారని ఆయన సతీమణి నారా భువనేశ్వరి ప్రశ్నించారు". రాష్ట్రం కోసం కష్టపడటమే ఆయన చేసిన తప్పా అని ప్రశ్నించారు. జగ్గంపేటలో టీడీపీ దీక్షా శిబిరానికి వెళ్లిన భువనేశ్వరి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజల సొమ్ము తీసుకోవాల్సిన అవసరం తమ కుటుంబానికి లేదని అన్నారు. స్వయంగా ఓ సంస్థ నడుపుతున్న తాను అందులో 2శాతం వాటా అమ్ముకున్నా రూ.400 కోట్లు వస్తాయని చెప్పారు. ఎన్టీఆర్ చూపిన బాటలోనే చంద్రబాబు నడుస్తున్నారని, ప్రజల గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు.

"రాళ్లతో కూడిన హైటెక్ సిటీ ప్రాంతాన్ని చక్కని శిల్పంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని భువనేశ్వరి అన్నారు". రాత్రిపగలన్న తేడా లేకండా కష్టపడే మనిషిని ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. "తెలంగాణ నుంచి ఏపీకి రావాలంటే వీసాలు, పాస్ పోర్టులు కావాలా అని నిలదీశారు."

అంతకు ముందు భువనేశ్వరి అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్నారు. చంద్రబాబు త్వరగా విడుదల కావాలంటూ ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును సాయంత్రం కుటుంబ సభ్యులు కలవనున్నారు. ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి సాయంత్రం 4 గంటలకు ములాఖత్ కానున్నారు. వారితో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు వెళ్లనున్నారు.

Updated : 25 Sept 2023 1:56 PM IST
Tags:    
Next Story
Share it
Top