Home > ఆంధ్రప్రదేశ్ > Nara Brahmini: కీలక నేతలతో భేటీ.. పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్

Nara Brahmini: కీలక నేతలతో భేటీ.. పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్

Nara Brahmini: కీలక నేతలతో భేటీ.. పొలిటికల్ ఎంట్రీ కన్ఫామ్
X

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. ఔటర్ రింగ్ రోడ్ స్కాంలో నారా లోకేశ్ కు.. సీఐడీ 41ఏ కింద నోటీసులు ఇవ్వనుంది. ఇక మరో కొన్ని రోజుల్లో లోకేశ్ ను కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వం కుట్ర పూరితంగానే చంద్రబాబు, లోకేశ్ లపై కేసులు పెడుతుందని టీడీపీ నేతల వాదన. ఈ క్రమంలో నారా భువనేశ్వరి, నారా బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో వాళ్లిద్దరు పాల్గొనడం, పార్టీ నేతలతో సమావేశాలు నిర్వహించడంతో.. రాజకీయాల్లోకి వస్తారని అనుకుంటున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పటికే భువనేశ్వరి బస్సు యాత్రకు సిద్ధం అవుతుండగా, బ్రాహ్మణి యువగళం పాదయాత్ర కొనసాగిస్తారని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల జనసేన నేతలు బ్రాహ్మణితో భేటీ అవ్వగా.. టీడీపీ నేతలు తరచూ ఆమెను కలుస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా చేయాల్సిన కార్యక్రమాలు, భవిష్యత్తు కార్యాచరణలపై బ్రాహ్మణి ఎప్పటికప్పుడు చర్చిస్తుంది. ఇవన్నీ చూస్తుంటే బ్రాహ్మణి రాజకీయ రంగ ప్రవేశం పక్కా అనే తెలుస్తుంది. గతంలో కుప్పం, హిందూపురం, మంగళగిరిలో ప్రచారం చేసిన అనుభవం బ్రాహ్మణికి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బ్రాహ్మణి తప్పక పార్టీలోకి రావాలని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే బ్రాహ్మణి ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు వైరల్ అవుతున్నాయి.


Updated : 30 Sept 2023 1:44 PM IST
Tags:    
Next Story
Share it
Top