Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలో వేసవి సెలవులు పొడిగించండి : లోకేష్

ఏపీలో వేసవి సెలవులు పొడిగించండి : లోకేష్

ఏపీలో వేసవి సెలవులు పొడిగించండి : లోకేష్
X

వేసవి సెలవులు అనంతరం ఏపీలో రేపటి నుంచే పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఎండలు తగ్గుముఖం పట్టకపోవడంతో ఈనెల 17 వరకు ఒంటి బడులను పెట్టనున్నారు. ఉదయం 7:30 గంటల నుంచి 11:30 గంటలకు తరగతులు నిర్వహించనున్నారు. అయితే వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున వేసవి సెలవులను పొడిగించాలని టీడీపీ డిమాండ్ చేస్తుంది. ఎండలు మండిపోతున్న వేళ పాఠశాలలు ప్రారంభించడం ఏంటని టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ప్రశ్నించారు. మరో వారం రోజులు పాటు సెలవులను పొడిగించాలని కోరారు. తల్లిదండ్రుల నుంచి సైతం సెలవులను పొడిగించాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సెలవులపై పెంపుపై సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవాలని లోకేష్ సూచించారు.

తెలంగాణలో కూడా జూన్ 12 నుంచే పాఠశాలలు ప్రారంభంకానున్నాయి. వేసవి సెలవులను పెంచే ఆలోచన లేదని విద్యాశాఖ ఇటీవల ప్రకటించింది. యథావిధిగా స్కూల్స్ ప్రారంభమవుతాయని ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు, పాఠశాల సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి.


Updated : 11 Jun 2023 3:27 PM IST
Tags:    
Next Story
Share it
Top