Home > ఆంధ్రప్రదేశ్ > Nara lokesh : జగన్ కుటుంబ సభ్యులే ఆయన్ని నమ్మట్లేదు...నారా లోకేశ్

Nara lokesh : జగన్ కుటుంబ సభ్యులే ఆయన్ని నమ్మట్లేదు...నారా లోకేశ్

Nara lokesh  : జగన్ కుటుంబ సభ్యులే ఆయన్ని నమ్మట్లేదు...నారా లోకేశ్
X

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు టీడీపీ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్. టీడీపీ ప్రభుత్వంలో కట్టిన ఇళ్లకు జగన్‌ రంగులు వేసుకుంటున్నారని ఆరోపించారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఏర్పాటు చేసిన టీడీపీ శంఖారావం బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ కోట్లు ఖర్చుపెట్టి యాత్ర-2 సినిమా తీయించారని చెప్పారు. కానీ థియెటర్లలో జనాలు లేక వైసీపీ పార్టీల వారే టికెట్లు కొంటున్నారని విమర్శించారు. వైసీపీ నేతలు ప్రజలకు డబ్బులిచ్చి సినిమాకు పొమ్మన్నా ఎవరూ వెళ్లట్లేదని తెలిపారు.

త్వరలోనే టీడీపీ, జనసేన ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. యువత రెండు నెలలు ఓపిక పట్టండని సూచించారు. జగన్ అంటే జైలు, బాబు అంటే బ్రాండ్ అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఓరిగిందేమి లేదని చెప్పారు. వైసీపీ లిక్కర్, ఇసుక ఇలా చాలా రకాలుగా ఏపీని దోపిడి చేసిందని తెలిపారు. మీ బిడ్డ అంటూ జగన్ ఇప్పుడు సెంటీమెంట్ డైలాగులు కొడుతున్నాడని...వాటిని ప్రజలు ఎవరు నమ్మరని తెలిపారు. జగన్ కుటుంబ సభ్యులే ఆయను నమ్మట్లేదని ఆరోపించారు. వారే ప్రాణభయంతో ఉన్నారని చెప్పుకొచ్చారు ఇంట్లో ఉన్న ఆడవారికే రక్షణ కల్పించలేని జగన్..సామాన్య ఆడబిడ్డలను ఎలా రక్షిస్తాడని ప్రశ్నించారు. ఏపీలో వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనేనని ధీమా వ్యక్తం చేశారు.




Updated : 13 Feb 2024 12:31 PM IST
Tags:    
Next Story
Share it
Top