Home > ఆంధ్రప్రదేశ్ > వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే..Nara Lokesh

వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే..Nara Lokesh

వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనే..Nara Lokesh
X

వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. టీడీపీ పాలనలో ఉత్తరాంధ్రను జాబ్‌ క్యాపిటల్‌ ఆఫ్‌ ఇండియాగా చేస్తే.. జగన్‌ గంజాయి క్యాపిటల్‌గా మార్చారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది టీడీపీనేనని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ రాగానే ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ‘శంఖారావం’ యాత్రకు శ్రీకారం చుట్టిన ఆయన బహిరంగ సభలో ప్రసంగించారు.

ఉత్తరాంధ్ర అమ్మలాంటిదన్నారు నారా లోకేశ్. .అమ్మప్రేమకి ఎలా కండిషన్స్‌ ఉండవో..ఉత్తరాంధ్ర ప్రజలూ అంతేనని తెలిపారు. పౌరుషాలు, పోరాటాలకు మారుపేరు శ్రీకాకుళం జిల్లా అన్నారు. గరిమెళ్ల సత్యనారాయణ, గౌతు లచ్చన్న, ఎర్రన్నాయుడు పుట్టి గడ్డ అని చెప్పారు. ఇలాంటి ప్రాంతంలో ‘శంఖారావం’ యాత్ర ప్రారంభిస్తుండటం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నాలుగున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వని జగన్.. ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారని మండిపడ్డారు. మోసం, దగా, కుట్రకి ప్యాంటు షర్ట్‌ వేస్తే జగన్‌లా ఉంటుందని విమర్శించారు.

2019 ఎన్నికల ముందు 23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని వైసీపీ మాట ఇచ్చి..తర్వాత 18 వేల పోస్టులే ఉన్నాయన్నారని తెలిపారు. స్కూల్‌ రేషనలైజేషన్‌ పేరుతో పోస్టులు తగ్గించారు. ఇప్పుడు ఎన్నికల ముందు నామమాత్రంగా 6 వేల పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు డీఎస్సీ ద్వారా లక్షా 70వేల పోస్టులు భర్తీ చేశారని గుర్తు చేశారు. వచ్చేది టీడీపీనేనని.. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు.

Updated : 11 Feb 2024 7:50 AM GMT
Tags:    
Next Story
Share it
Top