Nara Lokesh : జగన్ కొత్త పథకం పేరు..ఎమ్మెల్యేల బదిలీ...నారా లోకేశ్
X
వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారుటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. జగన్ పని అయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని తెలిపారు. ఈ మేరకు నరసన్నపేటలో శంఖారావం పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్న వైసీపీ ఎంపీలు కూడా జగన్‌కు బైబై అంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో 151 సీట్లు గెలిచి జగన్ ఏం సాధించారని అన్నారు. ఏపీలో జగన్ ఎమ్మెల్యేల బదిలీ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు.
ఈ నియోజకవర్గంలో పనిచేయని వాళ్లు పక్క నియోజకవర్గంలో చేస్తారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల బదిలీ తీసుకొచ్చినప్పుడే జగన్ ఓటమిని అంగీకరించినట్లని ఎద్దేవా చేశారు. జే ట్యాక్స్ మొత్తం జగన్ జేబుల్లోకి వెళ్తోందని ఆరోపించారు. మద్యం తయారీ, విక్రయాలన్నీ వైసీపీ ప్రభుత్వమే చేస్తూ జనం డబ్బు లాగేసుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు, 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. ఆఖరికి ఇంటి పన్నుతో పాటు చెత్త పన్ను కూడా వేశారని నారా లోకేశ్ విమర్శించారు.