Inner Ring Road Case :ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు.. లోకేశ్ ముందస్తు బెయిల్
X
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నారా లోకేశ్ ను సీబీఐ ఏ14గా పేర్కొంది. దీనికి సంబంధించిన మెమోలు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టింది. దాంతో లోకేశ్ ముందు జాగ్రత్త చర్యగా ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంపై మాట్లాడిన లోకేశ్.. అసలు వేయని రోడ్డు విషయంలో తనపై కేసు పెట్టారని.. ఏ14గా చేర్చారని అన్నారు. తనకు సంబంధం లేని శాఖలో తన పేరును పెట్టడం ఏంటని, ఇది జగన్ సర్కార్ పనితీరని మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్ అయిన కారణంగా.. యువగళం పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చినట్లు చెప్పారు. త్వరలోనే పాదయాత్ర తిరిగి ప్రారంభిస్తామని.. ఎక్కడ ఆగిందో అక్కడి నుంచి యాత్ర మొదలవుతుందని స్పష్టం చేశారు. ఈ యాత్రను ఆపేందుకే అక్రమ కేసులు పెట్టి ఏ14గా చేర్చారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పాదయాత్ర చేసి తీరుతానని హామీ ఇచ్చారు. దానికోసమే హైకోర్ట్ నుంచి ముందస్తు బెయిల్ పిటిషన్ తీసుకొచ్చినట్లు చెప్పారు.