Nara Lokesh : సీఐడీ నోటీసులపై స్పందించిన లోకేశ్.. జగన్లాగా..
X
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది. అక్టోబరు 4న ఉదయం 10గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని 41ఏ కింద అధికారులు నోటీసులు ఇచ్చారు. లోకేశ్ ప్రస్తుతం ఢిల్లీలోని ఎంపీ గల్లా జయదేవ్ ఆఫీసులో ఉండగా.. సీఐడీ అధికారులు అక్కడికి నోటీసులు అందజేశారు. ఈ నోటీసులపై లోకేశ్ స్పందించారు.
జగన్లాగా వాయిదాలు తప్పించుకునే అలవాటు తనకు లేదని లోకేశ్ అన్నారు. సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వస్తే ధైర్యంగా తీసుకున్నట్లు చెప్పారు. ‘‘పదేళ్లుగా జగన్, విజయసాయిరెడ్డి బెయిల్‌పై ఉంటున్నారు. వాళ్లు విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తీసుకోవాలి. వాళ్లలాగా తల్లిని ఆసుపత్రిలో పెట్టి సీబీఐ నుంచి తప్పించుకునేందుకు మేం నాటకాలు ఆడలేదు. ఇన్నర్ రింగ్‌రోడ్డుకు సంబంధించి ఎలాంటి తప్పు జరగలేదు.. తప్పుడు కేసులు నిలబడవు’’ అని లోకేశ్ అన్నారు.
జగన్ లెక్క క్విడ్ ప్రోకోతో పవర్ ప్లాంట్, పేపర్, ఛానల్ పెట్టలేదని లోకేశ్ చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి డబ్బులు విడుదల చేస్తూ సంతకాలు చేసిన అజేయ కల్లం, ప్రేమ్‌చంద్రారెడ్డి పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఎందుకు లేవో సీఐడీ చెప్పాలని లోకేశ్ ప్రశ్నించారు. ఇది కక్ష సాధింపు తప్ప మరొకటి కాదన్న ఆయన.. కచ్చితంగా న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు.,