Home > ఆంధ్రప్రదేశ్ > Nara Lokesh : జగన్ ఒక 420.. నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్

Nara Lokesh : జగన్ ఒక 420.. నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్

Nara Lokesh : జగన్ ఒక 420.. నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్
X

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఒక 420 అని, కటింగ్ మాస్టర్ అని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో శంఖారావం బహిరంగ సభను నిర్వహించారు. సభలో నారా లోకేశ్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ సలహాదారు అయిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చే సలహాలు అన్నీ పనికిమాలినవి అన్ని అన్నారు. సజ్జలకు రెండు చోట్ల ఓట్లు ఉన్నట్లు తెలిపారు. టీడీపీ ఉప ఎన్నికలో వైసీపీ గెలవడానికి దొంగ ఓట్లే కారణమని అన్నారు.

ఏపీలో దొంగ ఓట్లు నమోదు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటికే డీఎస్పీ, సీఐ, ఎస్ఐలు సస్పెండ్ అయ్యారని, రెండు రోజుల్లో నివేదిక కూడా వస్తుందన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారెవరు అయినా జైలుకు వెళ్లాల్సిందేనన్నారు. సీఎం జగన్ ఒక 420 అని, ఆయనపై 28 కేసులు ఉన్నాయన్నారు. అందరికీ క్లాస్ మేట్స్ ఉంటే జగన్‌కు మాత్రం జైల్ మేట్స్ ఉన్నారని ఎద్దేవా చేశారు. దేశంలోనే చెత్త కేబినెట్‌గా జగన్ కేబినెట్‌కు అవార్డు వచ్చిందన్నారు.

ఉత్తరాంధ్ర పోరాటా గడ్డ అని, వైసీపీ ఎన్నికేసులు పెట్టినా భయపడని టీడీపీ కార్యకర్తలకు వందనం చేస్తున్నానని నారా లోకేశ్ అన్నారు. ఏపీ మంత్రులను అర్ధరాత్రి లేపి అడిగినా వారి శాఖలు ఏంటో కూడా చెప్పలేరని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వారంతా కచ్చితంగా జైలుకు వెళ్తారని అన్నారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Updated : 15 Feb 2024 1:43 PM IST
Tags:    
Next Story
Share it
Top