Home > ఆంధ్రప్రదేశ్ > Nara Lokesh: ఉరి తీయండి, సైకో జగన్.. నారా లోకేశ్

Nara Lokesh: ఉరి తీయండి, సైకో జగన్.. నారా లోకేశ్

Nara Lokesh: ఉరి తీయండి, సైకో జగన్.. నారా లోకేశ్
X

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనలపై పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ కేసులు పెడుతున్నారు. ‘మోత మోగిద్దాం’లో విజిల్స్ వేశారని 60 మందిపై కేసు పెట్టారు. దీనిపై పార్టీ నేత నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్త చేశారు. కేసులేం ఖర్మ, రాజద్రోహం కింద ఉరితీయండని మండిపడ్డారు.

‘‘విజిల్స్ వేసి సౌండ్ చేశారని 60 మందిపై కేసా? పోలీస్ స్టేషన్‌కు పిలిచి విచారిస్తారా? వీళ్ల తీరు చూస్తుంటే టీవీలో చంద్రబాబు గారి అరెస్ట్ వార్తలు చూసారని, పసుపు రంగు దుస్తులు కట్టుకున్నారని, సైకిల్ బ్రాండ్ అగర్ బత్తీలు వాడారని కూడా కేసు పెట్టేలా ఉన్నారు. ఒక పని చేయండి రాజద్రోహం కేసు పెట్టి...ఉరిశిక్ష వేసేయండి. జగన్‌కి పిచ్చి పీక్స్‌లో ఉన్నట్లు ఉంది. కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చినోడికి సరే...అమలు చేసినోడి బుర్రా బుద్ధీ ఏమయ్యింది?’’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. జగన్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ధ్వజమెత్తారు. ‘‘సైకో జగన్ ఫ్యాక్షన్ పాలనలో ప్రజాస్వామ్యాన్ని పాతరేశారు. రాజ్యాంగాన్ని కాలరాశారు. సత్యాన్ని వధించారు, ధర్మాన్ని చెరపట్టారు. తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబు గారిని అక్రమ అరెస్టు చేసి జైల్లో నిర్బంధించారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపిస్తోన్న అరాచకాలని నిరసిస్తూ మహాత్మా గాంధీ జయంతి రోజైన నేడు‌.. నిరాహార దీక్ష చేసి చంద్రబాబు గారికి సంఘీభావం తెలుపుతున్నాను. సత్యమేవ జయతే’’ అని మరో ట్వీట్ చేశారు.

Updated : 2 Oct 2023 12:18 PM IST
Tags:    
Next Story
Share it
Top