Home > ఆంధ్రప్రదేశ్ > Nara Lokesh : కాసేపట్లో సీఐడీ విచారణకు నారా లోకేష్.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో..

Nara Lokesh : కాసేపట్లో సీఐడీ విచారణకు నారా లోకేష్.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో..

Nara Lokesh  : కాసేపట్లో సీఐడీ విచారణకు నారా లోకేష్.. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో..
X

టీడీపీ నేత నారా లోకేష్ కాసేపట్లో సీఐడీ విచారణకు హాజరుకానున్నారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని సీఐడీ ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అధికారులు లోకేష్ను విచారించనున్నారు. విచారణ సమయంలో లోకేష్‌తో పాటు న్యాయవాదిని అనుమతించాలని కోర్టు సీఐడిని ఆదేశించింది. ఫలానా దస్త్రాలతో రావాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయవద్దని సూచించింది. ఇన్నర్‌ రింగ్‌రోడ్‌ కేసులో ఏ14గా నారా లోకేష్‌ను సీఐడీ చేర్చింది.

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో అక్ర‌మాలు జరిగాయని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఫిర్యాదుతో సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో ఇప్పటికే చంద్రబాబును ఏ -1గా, నారాయణను ఏ-2గా పేర్కొన్న సీఐడీ, నారా లోకేష్ను ఏ-14గా పేర్కొంటూ విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రత్యేక మెమో దాఖలు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో చేసిన మార్పుల ద్వారా లోకేష్ లబ్ది పొందేందుకు ప్రయత్నించారని సీఐడీ ఆరోపించింది.

ఈ కేసులో కోర్టులో లోకేష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో లోకేష్కు సీఆర్‌పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని.. దానికి సంబంధించిన రూల్స్ పాటిస్తామని ఏజీ కోర్టుకు తెలిపారు. సీఆర్‌పీసీ 41ఏ నోటీసులు అంటే అరెస్ట్‌ లేకపోవడంతో ముందస్తు బెయిల్‌పై విచారణను ముగిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. ఈక్రమంలో సీఐడీ అధికారులు లోకేశ్‌కు 41ఏ కింద నోటీసులు జారీ చేశారు.


Updated : 10 Oct 2023 8:56 AM IST
Tags:    
Next Story
Share it
Top