Home > ఆంధ్రప్రదేశ్ > అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి :నారా లోకేష్

అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి :నారా లోకేష్

అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి :నారా లోకేష్
X

అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామన్నారు. నిరుద్యోగులకు రూ.3 వేలు భృతి అందజేస్తామని చెప్పారు. ఉచితంగా 3 గ్యాస్‌ సిలిండర్లు ఇవ్వడంతో పాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అని లోకేశ్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా తిరుపతి జిల్లా వెంకటగిరిలో ఆయన మాట్లాడారు.

వైసీపీ ప్రభుత్వం పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి తెలియకుండా వెనక్కు లాగేసుకుంటున్నారని విమర్శించారు. జగన్‌ ఒక కట్టింగ్‌, ఫిట్టింగ్‌ మాస్టర్‌ అంటూ ఎద్దేవ చేశారు. జగన్‌ వద్ద రెండు బటన్లు ఉన్నాయని.. బల్లపైన గ్రీన్‌ బటన్‌ నొక్కితే ఖాతాలో రూ.10 జమ అవుతుందని.. బల్ల కింద ఎర్ర బటన్‌ నొక్కితే ఖాతాల్లోంచి రూ.100 ఖాళీ అవుతుందని లోకేశ్ ఎద్దేవ చేశారు. వైసీపీ పాలనలో పెట్రోల్‌, విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు ఇష్టారీతిన పెంచారని విమర్శలు గుప్పించారు.

Updated : 22 Jun 2023 7:36 PM IST
Tags:    
Next Story
Share it
Top