Home > ఆంధ్రప్రదేశ్ > వెంకన్న గుడిలో కొత్త డిజైన్ హుండీలు

వెంకన్న గుడిలో కొత్త డిజైన్ హుండీలు

వెంకన్న గుడిలో కొత్త డిజైన్ హుండీలు
X

భక్తుల కోరికలు నెరవేర్చి, వడ్డికాసులను పుచ్చుకునే తిరుమల వెంకటేశ్వరుడి ఆలయంలోకి కొత్త రకం హుండీలు వస్తున్నాయి. ప్రస్తుత హుండీలను తరలించడంలో సమస్యలు, చేతివాటానికి అవకాశం ఉండడంతో టీటీడీ కొత్త డిజైన్లో స్టీలు హుండీలను తయారు చేసి పరీక్షిస్తోంది. ప్రస్తుతం కొప్పెరలో భారీ గంగాళాలు ఉంచి హుండీలు కడుతున్నారు. కొన్ని ఇత్తడి హుండీలూ ఉన్నాయి. భక్తులు అందులోనే కానుకలు వేస్తున్నారు. అయితే హుండీల్లో భక్తులు డబ్బులు వేసే సందర్భాల్లో కొందరు చేతవాటం ప్రదర్శిస్తున్నారు. నిండిన హుండీలను ట్రాలీల్లో గుడి నుంచి బయటికి తీసుకొచ్చి లిప్టుల ద్వారా లారీల్లోకి ఎక్కిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం అధికారులు కొత్త హుండీలను తయారు చేయించారు. వీటి ఎత్తు ఐదు అడుగులు. మూడువైపులా కానుక వేసేలా రంధ్రాలు ఉన్నాయి. ఎవరూ చేతివాటం ప్రదర్శించకుండా చేయి లోపలిపోకుండా కడ్డీలు అమర్చారు. వీటి పనితీరు బావుందని అధికారులు చెబుతున్నారు.

కాగా, శనివారం హుండీ ఆదాయం 4.19 కోట్ల రూపాయలుగా లెక్కతేలింది. 78వేల మందికిపైగా భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 38 వేల మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం భక్తుల రద్దీ సాధారణంగానే కొనసాగుతోంది. 22 కంపార్టుమెంట్లలో భక్తులు ఉన్నారు. దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

Updated : 30 July 2023 4:49 PM IST
Tags:    
Next Story
Share it
Top