Alert:10వ తరగతి విద్యార్థులకు అలర్ట్..పబ్లిక్ ఎగ్జామ్స్‌లో కొత్త విధానం
X
గత ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో 6 పేపర్లు ఉండగా..ఈ ఏడు మాత్రం ఏడు పేపర్ల విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. 50 మార్కులకు ఫిజిక్స్ , కెమిస్ట్రీని కలిపి ఒక పేపర్‌గా , మరో 50 మార్కులకు బయాలజీ పేపర్‌ను క్వశ్చన్ పేపర్‌గా ఇవ్వనున్నారు. ఈ రెండు పేపర్లలోనూ 17 ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు పేపర్లకు కలిపి 35 మార్కులు సాధిస్తే పాస్ అయినట్లు పరిగణిస్తారు. టీచర్ యూనియన్ లీడర్లతో విజయవాడలో ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ మంగళవారం నిర్వహించిన సమావేశంలో టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల్లో ఈ విధానం తీసుకువస్తున్నట్లు అనౌన్స్ చేశారు. రెండు రోజులు జరిగే జనరల్ స్టడీస్ పరీక్షల్లో ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయిస్తారు. మిగతా 5 సబ్జెక్టులు100 మార్కులకు ఒక్కొక్క పేపర్ ఉంటుంది.
పదో తరగతి పరీక్షల్లో ఇప్పటి వరకు అమలవుతున్న కాంపొజిట్ విధానాన్ని రద్దు చేశారు. ప్రస్తుతం 70/30 మార్కుల విధానంలో తెలుగు లేదా సంస్కృతం, ఉర్దూ లేదా హిందీ, ఉర్దూ లేదా అరబిక్, ఉర్దూ లేదా పార్శీ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇకపై ఫస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే 100 మార్కులకు ఉంటుంది.
తెలుగు క్వశ్చన్ పేపర్లోనూ పలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ప్రశ్నాపత్రాల్లో వచ్చే ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్నలను తీసేశారు. వీటి స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై నాలుగు క్వశ్చన్స్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చారు. ఒక్కోదానికి రెండు మార్కుల చొప్పున 8 మార్కులు కేటాయించారు. రెండో క్వశ్చన్‌గా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులకు ఉండేవి. ఇప్పుడు పద్యాన్ని చదివి,4 క్వశ్చన్స్కు నాలుగు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇందులోనూ ఒక్కో క్శశ్చన్కు రెండు చొప్పున 8 మార్కులు కేటాయించారు.
విన్నవించింది. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పాల్గొన్నారు.