Home > ఆంధ్రప్రదేశ్ > ఫుల్లుగా మందు కొట్టి కారు నడిపిన మంత్రి.. ఆ తర్వాత..

ఫుల్లుగా మందు కొట్టి కారు నడిపిన మంత్రి.. ఆ తర్వాత..

ఫుల్లుగా మందు కొట్టి కారు నడిపిన మంత్రి.. ఆ తర్వాత..
X

మందు తాగి వాహనం నడుపొద్దని పోలీసులు హెచ్చరిస్తూనే ఉంటారు. కానీ మందుబాబులు తగ్గేదేలే అంటూ మందు కొట్టి వాహనాలు నడుపుతుంటారు. అయితే ఓ చోట ఏకంగా మంత్రి ఫుల్లుగా మందు కొట్టి కారు నడిపింది. పైగా ఆమె న్యాయశాఖ మంత్రి. ఈ ఘటన న్యూజిలాండ్లో జరిగింది.

న్యూజిలాండ్‌ న్యాయశాఖ మంత్రి కిరి అలెన్‌ ఆదివారం రాత్రి ఫుల్లుగా మందు కొట్టి కారు నడిపింది. అంతేగాకుండా పార్కింగ్లోని వాహనాలను ఢీకొట్టింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆమెకు డ్రంకన్ డ్రైవ్ టెస్ట్ చేశారు. ఈ టెస్ట్లో ఆమె మద్యం తాగినట్లు తేలింది. దీంతో అలెన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. మంత్రి అస్సలు సహకరించలేదు. చివరికి ఆమెను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు.

కేసు నమోదు కావడంతో అలెన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆమెను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఒకవేళ ఆమె దోషీ అని తేలితే జరిమానాతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఆ దేశ ప్రధాని క్రిస్ హిప్కిన్స్ స్పందించారు. అలెన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. అలెన్ మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. మంత్రిగా విధులు నిర్వహించేందుకు తగినంత ఫిట్‌గా లేరని క్రిస్ అన్నారు. న్యాయశాఖ మంత్రి క్రిమినల్‌ కేసులో ఇరుక్కోవడం సహించరానిదన్నారు. కాగా పార్లమెంట్‌ సభ్యురాలిగా మాత్రం ఆమె కొనసాగుతారు.

Updated : 24 July 2023 3:41 PM IST
Tags:    
Next Story
Share it
Top