Home > ఆంధ్రప్రదేశ్ > ఆర్కే భార్య అరెస్టుపై ఎన్ఐఏ క్లారిటీ.. ఇంతకీ ఏం చెప్పిందంటే..?

ఆర్కే భార్య అరెస్టుపై ఎన్ఐఏ క్లారిటీ.. ఇంతకీ ఏం చెప్పిందంటే..?

ఆర్కే భార్య అరెస్టుపై ఎన్ఐఏ క్లారిటీ.. ఇంతకీ ఏం చెప్పిందంటే..?
X

మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య శిరీషను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడుకు వెళ్లిన అధికారులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎన్‌ఐఏ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్కే డైరీలోని విషయాల ఆధారంగా శిరీషతో పాటు దుడ్డు ప్రభాకర్‌ను కూడా అరెస్టు చేశామని ప్రకటించింది. 2019 తిరియా ఎన్‌కౌంటర్లో వీరిద్దరూ పాల్గొన్నారని, మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా భారీ కుట్రకు ప్రణాళిక సిద్ధం చేశారని ఎన్‌ఐఏ తన ప్రకటనలో చెప్పింది.

జులై 28న సమావేశం ఏర్పాటు చేసుకొని భారీ కుట్ర పన్నేందుకు మావోయిస్టు కేడర్‌ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు ఎన్ఐఏ తెలిపింది. వీరు రాసిన లేఖలు, సాహిత్య పుస్తకాలతో పాటు భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించింది. నిందితులు మావోయిస్టుల కోసం కొత్త రిక్రూట్‌మెంట్లు కూడా చేస్తున్నట్లు గుర్తించామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు.


Updated : 22 July 2023 6:49 PM IST
Tags:    
Next Story
Share it
Top