Home > ఆంధ్రప్రదేశ్ > డీజే చప్పుళ్లు..ఎలాంటి ఆర్భాటాల్లేవ్..IPSను పెళ్లాడిన IAS

డీజే చప్పుళ్లు..ఎలాంటి ఆర్భాటాల్లేవ్..IPSను పెళ్లాడిన IAS

డీజే చప్పుళ్లు..ఎలాంటి ఆర్భాటాల్లేవ్..IPSను పెళ్లాడిన IAS
X

ఈ మధ్యకాలంలో చాలా మంది డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేసుకుంటున్నారు. కోట్లకు కోట్లు ఖర్చుపెట్టి మరీ సినిమా లెవెల్లో పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమ ఫేవరేట్ టూరిస్ట్ స్పాట్‎లకు వెళ్లి ప్రీ వెడ్డింగ్ షూట్లు చేస్తూ నా నా ఆర్భాటాలకు పోతున్నారు. మెహందీ ఫంక్షన్ అని, సంగీత్ అని, పెళ్లి, రిసెప్షన్ అని ఇలా తమ దర్జాను చూపించు కోవడం కోసమే కొంత మంది వివాహాలు చేసుకుంటున్నారు. స్తోమత ఉన్నవారు పెళ్లికి కోట్లు ఖర్చు చేస్తుంటే, లేని వారు అప్పు చేసి మరీ ఆర్బాటాలకు పోతున్నారు. ఇలాంటి రోజుల్లోనూ ఎలాంటి హంగామా లేకుండా ఆర్భాటాలకు పోకుండా, డీజే చప్పుళ్లు, భారీ మండపాలు లేకుండానే వివాహం చేసుకుని తమ పదవులకు మరింత గౌరవాన్ని పెంచారు కృష్ణా జిల్లాకు చెందిన ఐఏఎస్ , ఐపీఎస్ అధికారులు. తోటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.





కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ అపరాజిత సింగ్‌ సిన్వర్‌ స్వస్థలం రాజస్థాన్. హైదరాబాద్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఐపీఎస్ అధికారి దేవేంద్రకుమార్‌

అదే రాష్ట్రానికి చెందిన వారు. వీరిద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని ఈ మధ్యనే నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బుధవారం జేసీ అపరాజిత సింగ్ బర్త్ డే కావడంతో ఇదే స్పెషల్ డేగా భావించి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అంతే అనుకున్నదే తడవుగా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న తన ఛాంబర్ లోనే నిరాడంబరంగా రిజిస్ట్రార్ దుర్గా ప్రసాద్ సమక్షంలో ఒకరికొకరు దండలు మార్చుకుని ఆదర్శ వివాహం చేసుకున్నారు.ఇక సబ్‌ రిజిస్ట్రార్‌ జగన్మోహనరావు వీరి పెళ్లిని రికార్డ్ చేశారు. వీరిద్దరి పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ న్యూస్‏గా నిలిచింది. పెద్ద హోదాలో ఉండి కూడా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.












Updated : 10 Aug 2023 9:20 AM IST
Tags:    
Next Story
Share it
Top