Home > ఆంధ్రప్రదేశ్ > లక్షితను చంపిన చోట మరో చిరుత.. ఆ అడవుల్లో మొత్తం 50కి పైనే..!!

లక్షితను చంపిన చోట మరో చిరుత.. ఆ అడవుల్లో మొత్తం 50కి పైనే..!!

లక్షితను చంపిన చోట మరో చిరుత.. ఆ అడవుల్లో మొత్తం 50కి పైనే..!!
X

తిరుపతిలోని అలిపిరి నడక మార్గంలో తాజాగా మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. నడక మార్గంలోని లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్‌ కెమెరాల్లో నమోదయ్యాయి. ఇటీవల చిరుత దాడికి గురై మరణించిన చిన్నారి లక్షిత మృతదేహం లభ్యమైన ప్రాంతంలోనే చిరుత సంచరించినట్లు అధికారులు తెలిపారు. చిరుత సంచారం శ్రీవారి భక్తులను కలవరానికి గురిచేస్తోంది. ఈ చిరుతను కూడా పట్టుకునేందకు అటవీశాఖ అధికారులు ఆపరేషన్ ప్రారంభించారు.

అందులో భాగంగా.. ఇప్పటివరకూ 4 చిరుతపులులను బంధించారు. ఆగస్టు 11న ఆరేళ్ల చిన్నారి లక్షితపై చిరుతపులి దాడి చెయ్యడంతో.. ఆ చిన్నారి మృతి చెందింది. దీనిపై పెద్ద ఎత్తున కలకలం రేగింది. దీంతో జూన్ నుంచి ఇప్పటి వరకు నాలుగు చిరుతల్ని బంధించారు. వాటిని తిరుపతిలోని జూకు తరలించారు. నాలుగు చిరుతల్ని బంధించడంతో ఇక చిరుతల బెడద తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయినా సరే ట్రాప్ కెమెరాలోను ఆ ప్రాంతాల్లోనే ఉంచారు. తాజాగా మరో చిరుత సంచారం కెమెరాల్లో రికార్డు కావడంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు.. దానిని కూడా బంధించే పనిలో ఉన్నారు. అలాగే భక్తులు కూడా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ సిబ్బంది సూచిస్తున్నారు. త్వరలోనే ఆ చిరుతను కూడా పట్టుకుంటామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.





అయితే అటవీశాఖ అధికారులు 2016 లెక్కల ప్రకారం శేషాచలం కొండల్లో 36 చిరుతలు, మూడు ఎలుగుబంట్లు ఉన్నట్లు గుర్తించారు. 2016 నాటి నుంచి నేటి వరకు సంతానోత్పత్తి ద్వారా ప్రస్తుతం చిరుతల సంఖ్య 50 దాటిందని అధికారులు గుర్తించారు. ఎలుగుబంట్లు కూడా సుమారు 8 ఉన్నట్లు భావిస్తున్నారు.. ఇది భక్తుల్లో ఆందోళన కలిగించే విషయం. మరోవైపు రానున్న రోజుల్లో శేషాచలం కొండల్లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు. కాగా, అభయారణ్య చట్టం ప్రకారం వన్యమృగాలను అరికట్టడం సాధ్యం కాదు. దీంతో చేయగలిగిందల్లా వాటిని పరిరక్షిస్తూ, శ్రీవారి భక్తులకు రక్షణ కల్పించడమే ప్రస్తుతం అధికారుల బాధ్యతగా మారింది. అయితే ఈ నెలలో తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఉండటంతో.. చిరుత సంచారం భక్తుల్లో ఆందోళన కలగిస్తోంది.




Updated : 1 Sept 2023 1:54 PM IST
Tags:    
Next Story
Share it
Top